అగ్రరాజ్యం అమెరికాలో హ్యాకర్లు రెచ్చిపోయారు. హై ప్రొఫైల్, బ్లూ టిక్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. బిట్‌కాయిన్ అకౌంట్ అడ్రస్ పెట్టి డబ్బులు పంపితే రెట్టింపు చెల్లిస్తామని మెసేజ్ ఉంచారు.
హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, అపర కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, నటి కిమ్ కర్ధాషియన్‌లతోపాటూ పలువురు ప్రముఖులు ఉన్నారు.
వారి ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ అడ్రస్‌కి వెయ్యి డాలర్లు పంపిస్తే, వెంటనే తిరిగి రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ మోసపూరిత ట్వీట్‌లు చేశారు. బ్లూ టిక్ ఉన్న అకౌంట్ల నుంచి ఈ ట్వీట్‌లు రావడంతో నిజమేననుకొని వారి అభిమానులు కొందరు భారీ మొత్తంలో హ్యాకర్లకు డబ్బులు కూడా పంపించినట్టు తెలుస్తోంది.
ప్రముఖుల ఖాతాల హ్యాక్ విషయాన్ని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రముఖుల ఖాతాలు హ్యాకర్లుబారిన పడినట్లు గుర్తించిన వెంటనే వాటిని కాపాడామని, ట్విట్టర్ సపోర్ట్ టీం చెప్పింది.
హ్యాకింగ్ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే పేర్కొన్నారు. నష్టాన్ని నివారించే పనిలో ఉన్నామని, హ్యాకింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు.
More Stories
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ జయకేతనం
అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్, విల్మోర్
అదానీ విద్యుత్ ఒప్పందాన్ని పరిశీలిస్తాం