
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనను సాగించాయి అనుకొంటున్న విశాఖపట్నంలో వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతూ ఉండడం అలజడిని సృష్టిస్తున్నాయి.
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన విశాఖలో మూడు నెలల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 18 మంది మృతి చెందగా, 592 మంది ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.
బహుశా దేశంలో మరే నగరంలో కూడా వరుసగా ఇన్ని ప్రమాదాలు జరిగిన సందర్భం లేదు. ఈ మూడు ప్రమాదాలు కూడా అర్ధరాత్రి పూట జరగడంతో పరిసరాలలోని ప్రజలు భయకంపితులు కావడం జరిగింది.
ఈ మూడింట్లో కూడా మానవలోపం లేదా ప్రమాదం కారణంగా కాకుండా యాజమాన్యం భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకొనక పోవడంతోనే వల్లనే జరగక పోవడం గమనార్హం. ఈ ప్రమాదాలతో విశాఖ ప్రజలు ప్రాణభయంతో గడుపుతున్నారు.
దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంలో ఒకటైన విశాఖలో పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను సరిగ్గా పాటించక పోవడం ప్రభుత్వ పర్యవేక్షణ యంత్రాంగాల లోపాన్ని వెల్లడి చేస్తున్నాయి.
ఆ భరోసాతోనే కాలంచెల్లిన యంత్రాలను మార్చకుండా, అత్యాధునిక సాంకేతికతను అమలు పరచకుండా, శిక్షణ పొందిన సిబ్బందిని సున్నితమైన ప్రమాదకర రసాయనాలతో పనిచేసే చోట నీయయించకుండా ఉండగలుగుతున్నట్లు స్పష్టం అవుతుంది.
ప్రమాదకరమైన, ప్రేలుడు పదార్ధాలను ఉపయోగించే పరిశ్రములు భద్రతా ప్రమాదాలకు తిలోదకాలిస్తున్నా ప్రభుత్వ నియంత్రణ యంత్రాంగం ఎక్కడ వారిని కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకొంటున్న దాఖలాలు లేవు.
ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఏవో కమిటీలు వేయడం, వారి నివేదికలను మూలాన పడవేయడం తప్పా బాధ్యులైన యజమానులపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకున్న ఉదంతాలు ఎక్కడా కనిపించడం లేదు.
రెండు నెలల క్రితం ఎల్జీ పొలిమెర్స్ లో జరిగిన ప్రమాదానికి ప్రధాన కారణం 60 ఏళ్ళ క్రితం మొలాసిస్ నిల్వకు నిర్మించిన టాంకర్ ను ఇప్పుడు విషపూరితమైన వాయువు నిల్వకు ఉపయోగించడం.
ఆ వాయువు లీక్ అవుతుంటే కట్టడి చేయగల యంత్రాంగం లేకపోవడం, అక్కడున్న సిబ్బంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తడం మినహా పరిసర ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేయడానికి అలారం కూడా మోగించక పోవడం గమనిస్తే వారికి ఎటువంటి శిక్షణ లేదని స్పష్టం అవుతుంది.
ఆ తర్వాత రాంకీ ఫార్మా సిటీ లోని రెండు ప్రమాదాలు జరిగాయి. ఆ రెండు చోట్ల కూడా అక్కడున్న సిబ్బందికి ప్రమాదాల పట్ల అవగాహన లేదు. అందుకనే సాయినర్ కంపెనీ వద్ద ఇద్దరు చనిపోయారు. సాల్వెంట్స్ లో కూడా రికవరీ రియాక్టర్‌లో లోపాన్ని గుర్తించినప్పటికీ సకాలంలో సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం
తన తండ్రి హత్యా కేసుపై గవర్నర్ కు డా. సునీత ఫిర్యాదు