ఉత్తర కాశ్మీర్ లోయలోని బారాముల్లాలో బీజేపీ నేత మెహరాజుద్దీన్ మల్లాను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఈయన వాటర్‌గామ్ అనే మున్సిపాలిటీకి వైస్ చైర్మన్‌గా ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్నారు.
ఉదయం ఆయన వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కారులో కిడ్నాప్ చేశారని అధికారులు పేర్కొంటున్నారు. ఆయన్ను గుర్తించడానికి భారీ సంఖ్యలో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. వివిధ ప్రాంతాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయని పోలీసులు ప్రకటించారు. మల్లా తండ్రిలో పాటు 2012లో బీజేపీలో చేరారు.
మల్లాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని బీజేపీ అధికార ప్రతినిధి అల్తఫ్ ఠాకూర్ ఆరోపించారు. ‘‘వాటర్‌గాం మున్సిపాలిటీకి ఈయన వైస్ ప్రెసిడెంట్. ఆయన తండ్రీ బీజేపీ నాయకుడే. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని సంవత్సరాల నుంచీ బీజేపీకి వారి కుటుంబం విధేయతగా ఉంటోంది.’’ అని అల్తఫ్ పేర్కొన్నారు.
బండిపోరా ప్రాంతంలో బిజెపి నేత వసీం బారిని, అతని ఇద్దరు కుటుంభం సభ్యులను వారి షాప్ వద్దనే హత్యచేసిన కొద్దీ రోజులకే ఈ అపహరణ జరగడం గమనార్హం.
More Stories
ఈషా ఫౌండేషన్‌పై పోలీసుల చర్యలకు `సుప్రీం’ బ్రేక్
జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతుంది
రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్