మహారాష్ట్ర సీఎం ఇంట్లో… మాజీ సీఎం వైరస్ ప్రాంతాల్లో

చైనీస్ కరోనా వైరస్ తో దేశంలో ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నది మహారాష్ట్ర. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసులలో సుమారు 30 శాతం కేసులు ఈ రాష్ట్రం నుండే వస్తున్నాయి.

అటువంటి పరిస్థితులలో మొత్తం పరిస్థితును తన అదుపులోకి తీసుకోవడం కోసం, అధికార యంత్రంగం పనిచేసేటట్లు చెయాయడం కోసం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఉంటారని ఆశిస్తాము.

అయితే మహారాష్ట్రలో ఏమి జరుగుతున్నది? ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చాల అరుదుగా తన వ్యక్తిగత నివాసం `మాతృశ్రీ’ నుండి బైటకు వస్తున్నారు. మొత్తం రాష్ట్రాన్ని మంత్రులు, అధికారుల దయాదాక్షిణ్యాలకే వదిలి వేస్తున్నారు.

వైరస్ ఇంత ఉధృతంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి థాకరే అసలు ఇల్లు వదిలి రావడం లేదని ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత నారాయణ రాణే విమర్శించారు. `మంత్రాలయ’ పేరుతో ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని అధికారులు పాలిస్తున్నారు. `మంత్రాలయ’లో మంత్రులు ఎవ్వరు ఉండటంలేదని చెబుతూ దాని పాతపేరు `సచివాలయం’గా తిరిగి మార్చాలని ఆయన సూచించారు.

ఆయన ఆరోపణలలో వాస్తవం నెలకొంది. వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి థాకరే రెండే సార్లు మాత్రమే బైటకు వచ్చారు. మొదటగా రాయగడ జిల్లాలోని నిసర్గ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వచ్చారు.

తర్వాత ఆషాడ ఏకాదశి సందర్భంగా పండరీపుర వద్ద శ్రీ విఠల్ కు ప్రభుత్వం తరపున జరిగిన మహాపూజలో పాల్గొనడానికి వచ్చారు. అన్ని మంత్రుత్వ శాఖల అధికారులు, సీనియర్ అధికారులు ఉండే `మంత్రాలయ’లో కూడా ఆయన అడుగు పెట్టలేదు.

కేవలం ముఖ్యమంత్రి అధికారిక పేజీలైన పేస్ బుక్ లో ప్రత్యక్ష సమావేశాలు, ట్విట్టర్ పోస్ట్ లద్వారానే మహారాష్ట్ర ప్రజలు ఆయన మాటలను వింటున్నారు. మహారాష్ట్రలోని పరిస్థితులను సమీక్షిస్తూ ఆసుపత్రులలో లేదా ఇతర పట్టణాలలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతూ ఎక్కడా కనిపించనే లేదు.

అయితే ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ మాత్రం క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులలో పనిచేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వలే థాకరే సహితం ఒక్క మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించడం లేదు. కేవలం ముఖ్యమంత్రిగా మంత్రివర్గంకు అధ్యక్షత వహిస్తున్నారు.

మరోవంక, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు జరుపుతున్నారు. వివిధ నగరాలు, ఆసుపత్రులలో పర్యటిస్తూ సమీక్షలు జరుపుతున్నారు. ప్రతిపక్ష నేతగా అధికార హోదాతో సమీక్ష సమావేశాలు జరుపవచ్చు గాని ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వలేరు. అయితే బాధ్యతగల ప్రతిపక్ష నేతగా తాను చేయవలసిన కృషి అంతా చేస్తున్నారు.

అయితే ప్రధాన స్రవంతిలో మీడియా ఆయన కృషిని గుర్తించడంలో విఫలం అవుతున్నది. వివిధ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటనలను విస్మరిస్తున్నది. కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రజలు ఆయన పర్యటనల గురించి తెలుసుకోగలుగుతున్నారు.

ప్రభుత్వం నుండి తమకు ఎటువంటి మద్దతు లభించడం లేదని, మీరే ముఖ్యమంత్రిగా ఉంటె పరిస్థితులు చాలా మెరుగుగా ఉండేవని అంటూ ఒక పోలీస్ ఆయనతో చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానితో ఆ పోలీస్ పై థాకరే ప్రభుత్వం కక్షసాధింపు చర్యగా అతనిని 150 కిమీ దూరంలో ప్రాధాన్యతలేని పోస్ట్ కు బదిలీపై పంపించింది.

తమకు సహాయం అందించమని సాధారణ ప్రజలు ఫడ్నవిస్ ను వేడుకోవడం, తన సామర్ధ్యం మేరకు కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం వంటి అనేక వీడియోలు నేడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కొద్దీ రోజుల క్రితం ప్రభుత్వం చెబుతున్న కరోనా మరణాలు వాస్తవాలకు   విరుద్ధంగా ఉంటున్నాయని ఫడ్నవిస్ చెప్పడంతో, ప్రభుత్వం మేల్కొని ఆ మరుసటి రోజునే అంతకు ముందు గుర్తించని కొన్ని మరణాలను కరోనా మరణాలుగా గుర్తింప వలసి వచ్చింది. 

వైరస్ ప్రభావిత ప్రాంతాలలో ఫడ్నవిస్ పర్యటనల గురించి సెన్సార్ అమలు జరుపుతున్న దేశంలో ప్రగతిశీల మీడియాగా చెప్పుకొనే మరాఠి మీడియా ముఖ్యమంత్రి స్వీయ నిర్బంధం గురించి, ఆయన రాష్ట్రంలో ఎక్కడా పర్యటనలు జరపడం లేదని ప్రచురించడంలో విఫలం చెందుతున్నది.