దివాళా తీసిన ఎంఎస్‌‌ఎంఈల కోసం ఓ పధకం 

దివాలా తీసిన కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌‌ఎంఈల) కోసం  త్వరలోనే ఓ ప్రత్యేక పధకాన్ని  తీసుకురానున్నట్టు కేంద్ర  ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతోన్న ఆర్ధిక వ్యవసాతకు మద్దతు ఇచ్చేందుకు తీసుకునే చర్యలపై ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష జరిపారు. 
 
ఎంఎస్‌‌ఎంఈలకు ఊరటనిచ్చేందుకు ఇన్‌‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌‌రప్ట్‌‌స్సీ కోడ్ కింద స్పెషల్ ఇన్‌‌సాల్వెన్సీ రిజొల్యూషన్‌‌ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖరారు చేస్తోందని అధికారక ప్రకటన పేర్కొంది. ఇన్‌‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌‌రప్ట్‌‌స్సీ కోడ్ కిందనున్న సెక్షన్ 240ఏ కింద ఈ పధకాన్ని ప్రకటింపనున్నారు.  
 
చిన్న వ్యాపారాల కోసం ఈ బ్యాంక్‌‌రప్ట్‌‌స్సీ కోడ్ ను సవరింపనున్నారు. ఈ కోడ్ లో ఉన్న సెక్షన్ 29ఏ నుంచి ఎస్‌‌ఎంఈలకు ఒక ప్రధాన  మినహాయింపు ఉంది. కంపెనీల మేజర్ షేర్‌ ‌‌‌హోల్డర్స్‌‌ కనుక డిఫాల్ట్ అయితే, ఈ స్కీమ్ కింద రిజొల్యూషన్‌‌లో పాలు పంచుకోవడానికి వీలుండదు. 
 
జూన్‌‌లో ప్రభుత్వం ఇన్‌‌సాల్వెన్సీ కోడ్‌‌న ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. కరోనా లాక్‌‌డౌన్‌‌తో మార్చి 25 తర్వాత డిఫాల్ట్స్ అయిన వ్యాపారాలను ఏ లెండర్లు కూడా ట్రిబ్యునల్స్ ముందుకు లాగలేదు. కరోనా మహమ్మారితో ఏర్పడిన నష్టాలతో, ఇబ్బందులు పాలవుతున్న వ్యాపారాలకు కేంద్రం పలు ఊరట చర్యలను ప్రకటించింది. 
 
ఆదాయపన్ను చట్టం, కంపెనీల చట్టం  కిందనున్న పలు చట్టాల్లో తుది గడువులు పొడిగించింది. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం ఆర్థిక మంత్రి పలు చర్యలను కూడా ప్రకటించారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.1.2 లక్షల కోట్లలో బ్యాంక్‌‌లు ఇప్పటి వరకు రూ.61,988 కోట్లను విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు.