కరోనా పరీక్షలు వేగవంతం చేసేందుకు 15వేల నుంచి 20వేల యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని, అలాగే ప్రభుత్వం ఇంటింటికీ మెడికల్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిందని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధానికి మెడికల్ స్ర్కీనింగ్, టెస్టులు ఉత్తమమైన మార్గాలు అని, ఈ మేరకు ఇంటింటికీ మెడికల్ స్ర్కీనింగ్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఎవరికైనా లక్షణాలు గుర్తించినట్లయితే.. నమూనాలను తీసుకొని పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రక్షణగా చికిత్స అవసరమని యోగి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) అవనీష్ అవాస్తి మాట్లాడుతూ వైద్య స్క్రీనింగ్ పనుల కోసం 1.40 లక్షలకు పైగా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిరంతరం టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, తద్వారా ఆర్‌టీపీసీఆర్ ద్వారా టెస్టింగ్ సామర్థ్యం రాష్ట్రంలో రోజుకు 30వేలకు చేరుకుందని తెలిపారు.
రోజుకు 15 వేల నుంచి 20 వేల యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తామని, ట్రూ నెట్ మిషన్ ద్వారా రోజుకు 2వేల పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. యూపీలో ఇప్పటి వరకు 35,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
More Stories
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
కోల్కతా పోలీస్ కమిషనర్పై వేటుకు మమతా సమ్మతి