ఉజ్జెయినిలో మహాకాళేశ్వరుడికి పూజలు నిర్వహించెందుకు వికాస్ అక్కడకు వెళ్లినట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం ఉజ్జయిని గుడికి వచ్చిన దుబేను ఒక షాపు యజమాని గుర్తుపట్టి పోలీసులను అప్రమత్తం చేశాడు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుబేను ఐడీ అడగగా ఫేక్ ఐడీ కార్డ్ ఇచ్చాడు. అంతే కాకుండా వారితో గొడవకు దిగాడు. దీంతో దుబేను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పజెప్పారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆ రాష్ట్ర డీజీపీ ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే దూబే అరెస్టు గురించి యూపీ ముఖ్యమంత్రి యోగికి శివరాజ్ చెప్పినట్లు సమాచారం. గత వారం కాన్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో వికాస్ ప్రధాన నిందితుడు.
జూన్ 2న 60 కేసుల్లో నిందితుడైన దుబేను అదుపులోకి తీసుకునేందుకు అతని గ్రామానికి వెళ్లిన పోలీసులపై దుబే, అతని 15 మంది అనుచరులపై పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి దుబే, అతని అనుచరులు తప్పించుకుని తిరుగుతున్నారు.
దాదాపు 40 బృందాలు మూడు రాష్ట్రాల్లో దుబే కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన అనుచరుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబే అనుచరుల్లో ఐదుగురుని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బుధవారం తెల్లవారుజామున దుబే ముఖ్య అనుచరుడు అమర్ దుబేను ఎన్‌కౌంటర్ చేశారు.
గురువారం మరో ఇద్దరు అనుచరులను ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రభాత మిశ్రా, ప్రవీణ్ దుబే చనిపోయారన్నారు. కారు దొంగలించి పారిపోతున్న ప్రవీణ్ దుబేను కాల్చిచంపినట్లు అధికారులు చెప్పారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!