లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయాలి అనుకొంటే సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏక్షణంలో టిటిడి చైర్మన్ గా నియమించారో గాని అప్పటి నుండి ఆయనను క్రైస్తవ నీడ వెంటాడుతున్నది. వై ఎస్ కుటుంభం అంతా క్రైస్తవ మతప్రచారంలో మునిగిపోయి ఉండడంతో, వై ఎస్ రాజశేఖరరెడ్డికి తోడల్లుడైన సుబ్బారెడ్డిని సహితం ఆ నీడ వదలడం లేదు.
తాజాగా, రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలో ఆయన భార్య విజయమ్మ వ్రాసిన “నాలో… నాతొ వై ఎస్ ఆర్” అన్న గ్రంథావిష్కరణ జగన్ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి భార్య అక్కడ బైబెల్ ను చేతిలో పట్టుకొని ఫొటోలో కనిపించడం పెను వివాదానికి దారితీస్తున్నది. ఈ విషయమై సోషల్ మీడియాలో శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టిటిడి చైర్మన్ గా నియామకం జరగగానే, ఒకా ఆయన బాధ్యతలు చేపట్టాక ముందే ఆయన క్రైస్తవుడు అంటూ వివాదం చెలరేగింది. అటువంటి వ్యక్తికి ఒక హిందూ క్షేత్రం బాధ్యతలు అప్పజెప్పుతారా అన్న రచ్చ జరిగింది. దానితో తాను పక్క హిందువుడిని అంటూ మెడలోని తన రుద్రాక్ష మాలను చూపించుకో వలసి వచ్చింది. తమ కుటుంబ గోపూజ, హోమం చేస్తున్న ఇంటిలోని ఫోటోలను ప్రదర్శించుకో వలసి వచ్చింది.
టిటిడి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వివాదాలు ఆయనను వదలడం లేదు. తిరుమలకు వచ్చే బస్సు టిక్కెట్ల వెనుక జెరూసలేం యాత్ర ఫోటోలు ముంద్రించడం పెద్ద దుమారం రేపింది. టిటిడి భవనాలకు సమీపంలో ఒక విద్యుత్ స్తంభంపై క్రైస్థవుని క్రాస్ ఆకారం కనిపించడం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
అయితే ఇవ్వన్నీ ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి ఇతరత్రా ప్రయోజనాలకోసం లేవదీసిన దుమారాలని ఆ తర్వాత తేలడంతో జగన్ ఆ అధికారిపై చర్యకు ఉపక్రమించారు. అది వేరే విషయం.
ఇంతలో టిటిడి ప్రచురించి మాసపత్రిక సప్తగిరిలో ఓ భక్తుడి “నది రాత్రి వేళ ఆమె దీపం” అనే క్రీస్తు ప్రచార మాసపత్రిక కలిపి పోస్ట్ లో రావడం తాజాగా మరో వివాదం పుట్టుకొచ్చింది.
ఇక టిటిడి ఆస్తుల వేలం మరో పెద్ద దుమారాన్ని లేవదీసింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పక్రియ అయినప్పటికీ మొత్తం ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టింది. ఇటువంటి ప్రతి వివాదం సుబ్బారెడ్డిని ఆత్మరక్షణలో పడవేస్తున్నది. ప్రతి సారి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు