దక్షిణ ఆఫ్రికా హిందూ పార్టీ నేత జయరాజ్ మృతి 

దక్షిణ ఆఫ్రికాలో గల ఏకైక హిందూ రాజకీయ పార్టీ వ్యవస్థాపక  సభ్యుడు, ఆ పార్టీ జాతీయ నేత జయరాజ్ బచ్చు కరొనతో మృతి చెందారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు.

డర్బన్ లో నివాసముండే ఆయనకు వైరస్ సోకినా తర్వాత ఆసుపత్రిలో చేరిన వారం రోజులకన్నా ముందే మృతి చెందిన్నట్లు ఆయన కుమారుడు ఉమేష్ తెలిపారు. ఆయనకు ఇచ్చిన ఆంటిబయోటిక్ కోర్స్ విఫలమైన్నట్లు చెప్పారు.

శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ఆసుపత్రి అధికారులు ఫోన్ చేసారని, ఇద్దరు కుటుంభం సభ్యులు రావచ్చని అన్నారని, కానీ తాను వెళ్ళేసరికే ఆయన మృతి చెందారని వివరించారు.

గత ఐదు దశాబ్దాలుగా సామజిక కార్యక్రమాలలో, రాజకీయ సంస్థలలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరమే ఇతరులతో కలసి హిందూ యూనిటీ మూవెమెంట్ ఏర్పాటు చేసి, రాజకీయ పార్టీగా ఎన్నికల కమీషన్ వద్ద నమోదు చేయించారు.

దక్షిణ ఆఫ్రికాలో నివసిస్తున్న హిందువుల గురించి స్వరం వినిపించే వారు రాష్ట్రాలలో గాని, జాతీయ స్థాయిలో గాని ఎవ్వరు లేక పోవడంతో ఈ పార్టీని ఏర్పాటు చేయవలసి వచ్చిందని చెప్పారు.

“ప్రస్తుతం దేశంలో ఉన్న హిందూ ధార్మిక, సాంస్కృతిక సంస్థలు ప్రభుత్వం వెలుపల ఉంది హిందువులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతున్నాయి. ఆయా సమస్యలు సమర్ధవంతంగా పరిష్కారం కావలి అంటే ప్రభుత్వం లోపల ఎవరైనా ఉండాలి” అంటూ పార్టీ ప్రారంభ అవసరాన్ని వివరించారు.

ఏ పని చేపట్టినా సానుకూల ధోరణిలో, లౌక్యంతో చేస్తూ ఉండడంతో సమాజానికి మంచి జరుగుతూ ఉండెడదని ఈ పార్టీ అధ్యక్షుడు, బచ్చుకు సన్నిహిత మిత్రుడు రామ్ మహారాజ్ పేర్కొన్నారు.

ప్రైవేట్ గృహాలలో దీపావళి సంబరాలను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో దీపావళి రోజున హిందువులు టపాకాయలు కాల్చుకోవడానికి అనుమహతి ఇవ్వాలని 1980వ దశాబ్దం నుండి హిందువుల హక్కుల కోసం బచ్చు పోరాడుతూ వస్తున్నారని ఆయన నివాళులు అర్పించారు.

బచ్చు కు భార్య రేణుక, పిల్లలు వినోద్, ఉమేష్, రేష్మ, హరినారాయణ్ , రింకు సింగ్ లతో పాటు మనవలు కూడా ఉన్నారు.