తమకు అతి సమీపంలో హిందూ సాధువులను దారుణంగా హత్యచేస్తే అసలు స్పందించకుండా వేలమైళ్ల దూరంలో అమెరికాలో నల్లజాతివారిని హతమారుస్తున్నారని అంటూ పలువూరు బాలీవుడ్ తారలు మొసలికన్నీరు కార్చుతుండడం పట్ల అమెరికాలో భారత సంతతికి చెందిన రచయిత్రి, మానేజిమెంట్ సలహాదారు, రాజకీయ వేత్త పూర్ణిమ నాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అంతకన్నా అధ్వాన్నం ఏమిటంటే వారిలో పలువురు వర్ణ వివక్షతకు సంకేతంగా నిలిచిన తెల్ల చర్మంకోసం అంటూ కరీం లకు ప్రకటనలలో పాల్గొంటున్నారని ఆమె ఒక వెబినార్ లో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. బాలీవుడ్ లో ఉన్న వర్ణ వివక్షత భారత దేశంలో మరెక్కడా లేదని ఆమె మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా షహీన్ బాగ్ లో ఏమి జరిగిందే నేడు అమెరికాలో బి ఎల్ ఎం పేరుతో అదే జరుగుతున్నదని ఆమె పేర్కొన్నారు. వీరంతా సంఘీభావం తెలుపుతున్న అమెరికాలోని ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ (బి ఎల్ ఎం) ఉద్యమంపై అక్కడున్న నల్లవారి సమస్యలకు అసలు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
వీరంతా నల్లవారి కోసం కాకుండా, డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చే అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్థి గెలుపుకోసం సృష్టిస్తున్న అల్లర్లే ఈ ఉద్యమమని ఆమె ఆరోపించారు. ఈ ఉద్యమంలో నల్లజాతీయులు చెందిన ప్రముఖులు ఎవ్వరు లేరని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలఈ కోసం మార్క్సిస్టు, లెనినిస్ట్ లు, ముస్లింల మద్దతుతో సాగుతున్న అల్లర్లని ఆమె దుయ్యబట్టారు. అయితే అమెరికాలోని భారత సంతతి వారనేకమంది వీరికి మద్దతు పలకడం, భారీగా నిధలు ఇస్తూఉండడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు.
యాదృశ్చికంగా ఒక తెల్లవాడు నల్లవాడిని చెపితే అల్లారు చేస్తున్నవీరు నల్లవారే చంపినా నల్లవారి పట్ల కనీసం సానుభూతి కూడా చూపించడం లేదని ఆమె ధ్వజమెత్తారు. భారత దేశంలో ఆర్టికల్ 370 రద్దు, సిఎఎ వంటి అంశాలకు వ్యతిరేకంగా జరుగున్న ఉద్యమాలను నడిపిస్తున్నటువంటి వామపక్ష తీవ్రవాద శక్తులే అమెరికాలో నేడు అల్లర్లు సృష్టిస్తున్నాయని ఆమె తెలిపారు.
బి ఎల్ ఎం ఉద్యమకారులు అంత భారత దేశానికి, ముఖ్యంగా అమెరికాలోని హిందువులకు వ్యతిరేకమని ఆయా తెలిపారు. ఈ ఉద్యమం వ్యవస్థాపకుడు మార్కిస్టు శిక్షణ పొందినవాడని అంటూ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
అమెరికా చరిత్రలో బానిసత్వంకు వ్యతిరేకంగా చట్టం చేసిన ఘనత రిపబ్లికన్ పార్టీకి ఉన్నదని, 1920లో మహిళలకు వోట్ హక్కు ఇచ్చినది కూడా ఈ పార్టీయే అని ఆమె గుర్తు చేశారు. అమెరికాలో నల్లవారు 13 శాతం మంది మాత్రమే ఉన్నారని, కానీ ఆసియా సంతతి వారు 16 శాతం ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
స్వేతజాతీయుల మద్దతు లేకుండా నల్లజాతికి చెందిన బరాక్ ఒబామా వరుసగా రెండు సార్లు అమెరికా అధ్యక్షుడు అయి ఉండేవారా అని ఆమె ప్రశ్నించారు.
More Stories
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత