చైనా కంపెనీలకు చెందిన 59 యాప్‌లపై భారత ప్రభుత్వం సోమవారం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ ‘వైబో’ నుంచి మోదీ తప్పుకున్నారు.
వైబో అకౌంట్‌లో గతంలో మోదీ పెట్టిన ఫొటోలు, కామెంట్లు, పోస్టులు, ప్రొఫైల్ ఫొటోతో సహా పూర్తి వివరాలను తొలగించారు. ప్రస్తుతం ఈ పేజీ పూర్తి బ్లాంక్ (ఖాళీ)గా కనబడుతోంది. అకౌంట్‌లోని సమాచారాన్ని తొలగించే వరకు ప్రధాని ఇప్పటి వరకూ 115 పోస్టులు చేశారు. అన్ని పోస్టులను మాన్యువల్‌గా డిలీట్ చేశారు.
వైబోలో మోదీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అందులో ఎక్కువమంది చైనీయులే. 2015 నుంచి చైనాకు సంబంధించిన విషయాలను మోదీ వైబోలోనే పంచుకునేవారు. ప్రధానిగా చైనాలో పర్యటించే ముందు 2015లో మోదీ వైబోలో అకౌంట్ తెరిచారు.
‘హలో చైనా! వైబో ద్వారా చైనా స్నేహితులతో మాట్లాడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని మోదీ ట్విటర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. చైనాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్‌ను చాలా మంది చైనీయులు వినియోగిస్తున్నారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
జార్ఖండ్‌కు అతిపెద్ద శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ
కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం ప్రచార ఎత్తుగడే!