భారతదేశ సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బీజింగ్ దురాక్రమణలో భాగమేనని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం భారత్, చైనాల మధ్య ఏర్పడిన పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కైలీ మెక్ ఎనానీ వెల్లడించారు.
ఇరు దేశాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తాము మద్దుతిస్తామని చెప్పారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను ఆక్రమించడానికి చైనా ప్రయత్నిస్తుందనడానికి భారత సరిహద్దుల్లో దూకుడు వైఖరి నిదర్శమని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారని ఆమె తెలిపారు. ఈ చర్యలు చైనా కమ్యూనిస్టు పార్టీ నిజస్వభావాన్ని నిర్ధారిస్తాయని ధ్వజమెత్తారు.
అంతకుముందు వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించడాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ప్రశంసించారు. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతను పెంచుతుందని వెల్లడించారు.
ఇలా ఉండగా, నియంతృత్వ చర్యలు, చట్టాలతో హాంకాంగ్‌ను మింగెయ్యాలనుకుంటే, చూస్తూ ఊరుకోబోమని అమెరికా చైనాను హెచ్చరించింది. హాంకాంగ్ స్వయంప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉన్న వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి చైనా మంగళవారం ఆమోదం తెలపడాన్ని హాంకాంగ్ ప్రజలకు ఇదో విచారకరమైన రోజుగా మైక్ పాంపియో అభివర్ణించారు.
హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాయడమే చైనా గొప్ప విజయంగా భావిస్తున్నదని విమర్శించారు. ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’గా ఉన్న విధానాన్ని.. ‘ఒక దేశం, ఒక వ్యవస్థగా’ మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
More Stories
గాజాలో 19న మొదటి విడత బందీల విడుదల!
ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ళు, భార్యకు 7 ఏళ్ళు జైలు
రష్యా తరుఫున యుద్ధంలో 12 మంది భారతీయులు మృతి