ఒక వైపు హైదరాబాద్ లో కరోనా టెస్టులు పెంచుతున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎవ్వరికైనా కరోనా పరీక్షా జరపడానికి సిద్దమే అంటూ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.
కానీ ప్రభుత్వం టెస్టింగ్ సామర్ధ్యం పెంచకుండా, ఉన్న కేంద్రాలనే మూసివేస్తున్నది. వత్తిడికి తట్టుకోలేక పలు ప్రై
వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జియాగూడ, అంబర్ పేట, మలక్ పేట, గోల్కొం డ ఏరియా హాస్పిటల్స్ లో టెస్ట్లు బంద్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు
అలా 2,500కి పైగా టెస్ట్ చేయాల్సి ఉండగా, వెయ్యి లోపే శాంపి ల్స్ తీసుకుంటున్నారు. దాంతో చాలామంది ప్రైవేట్ లో చేయించుకుంటున్నారు. పేదలు రోజులతరబడి ప్రభుత్వ సెంటర్లకు తిరుగుతున్నారు. అసలు నగరంలో టెస్టింగ్ సెంటర్లు ఎక్కడున్నాయో చాలామందికి తెలియని పరిస్థితి నెలకొంది. మరోవంక
మూసివేసిన కేంద్రాల గురించి వైద్యశాఖ అధికారులు వెల్లడించడం లేదు. ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారనేది కూడా చెప్పలేకపోతున్నారు. ఈ కేంద్రాల వద్ద కరోనా అనుమానితులు ఉదయం నుండే క్యూ కడుతుంటే, కొందరి నమూనాలు తీసుకొని మిగిలిన వారిని మరుసటి రోజు రమ్మనమని పంపించి వేస్తున్నారు. క్యూలో ఎంతమంది ఉన్నా ఒక్కో సెంటర్ లో 200– 250 శాంపి ల్స్ మాత్రమే తీసుకుంటున్నారు.
40 ఏళ్లు దాటిన వారికే టోకెన్లు ఇస్తున్నారు. యువకుల శాంపి ల్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవంక, నగరంలోని సిటీలోని 18 ప్రైవేట్ సెంటర్లకూ అనుమానితులు క్యూ కడుతున్నారు. అక్కడా లోడ్ పెరగడంతో ఓ డయాగ్నస్టిక్ బుధవారం నుంచి 5వ తేదీకి శాంపిల్స్ సేకరణ బంద్ పెట్టింది.
మరో సెంటర్ మిషన్ ట్రబుల్ ఇవ్వడంతో ఆపేసింది. ఎక్కువ టెస్టులు చేస్తే ఉన్నతాధికారులు ఫైర్ అవుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ సెంటర్ లో టెస్ట్లు ఎక్కువ చేసినందుకు ఉన్నతాధికారి ఒకరు సీరియస్ అయి, తగ్గించాలని చెప్పినట్లు చెబుతున్నారు.
More Stories
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
ఒకవైపు ప్రజాపాలన దినోత్సవాలు.. మరోవైపు విముక్తి దినోత్సవాలు
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర