ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్‌లు భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు మన దేశ వినియోగదారుల డేటాను అనధికారికంగా చేరవేస్తున్నట్లు, రహస్యంగా, దొంగతనంగా డేటాను పంపిస్తున్నట్టు ఐటీ శాఖకు అనేక ఫిర్యాదులు అందాయి.
ఇది చాలా ఆందోళన కలి గించే విషయమైనందున అత్యవసర చర్యలు చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ హానికరమైన యాప్‌లను నిరోధించడానికి భారత సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా సమగ్ర సిఫార్సులను పం పాయి.
డేటా సెక్యూరిటీ, గోప్యతకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు ఐటీ శాఖ తెలిపింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు కూడా డేటా భద్రత, గోప్యతలకు సంబం ధించి ఫిర్యాదులు అందాయి. దేశ సార్వభౌమత్వానికి, పౌరుల గోప్యతకు హాని కలిగించే మొబైల్ యాప్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది.
ఆయా యాప్‌లు వాణిజ్య ప్రకటనల ద్వారా భారత్‌లో రూ.వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాయి. టిక్‌టాక్ మొత్తం వినియోగదారుల్లో 30 శాతం మంది మన దేశం నుంచే ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఆయా కంపెనీల ఆదాయం గణనీయంగా పడిపోవడమే కాకుండా వాటి విలువ తగ్గుతుంది. చైనా యాప్ రెవెన్యూలో 2016 నుంచి ఏటా 140 శాతం వృద్ధిరేటు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
చైనా యాప్‌లపై నిషేధం విధించడంతో భారతీయ యాప్ మార్కెట్ విస్తరించే అవకాశం ఉంది. టిక్‌టాక్ వంటి యాప్‌లకు పోటీగా ఇప్పటికే చింగారీ వంటి స్వదేశీ యాప్ నిలదొక్కుకుంటోంది.
అలాగే న్యూస్‌డాగ్, హెలో వంటి న్యూస్ అగ్రిగేటర్లకు దీటైన స్వదేశీ యాప్స్ నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చైనా దుందుడుకు చర్యలకు తగిన సమాధానంగానే యాప్‌లపై నిషేధం విధించినట్లు అవగతమవుతోంది.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు