విదేశీ వస్తువులకు ప్రత్యేక కలర్ కోడ్ 

చైనా వస్తువుల దిగుమతులను కట్టడి చేసే కృషిలో భాగంగా స్థానిక, విదేశీ వస్తువులకు ప్రత్యేక కలర్ కోడ్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నది. ప్రష్టుత్వం శాఖాహార, మాంసాహారులకు ప్రహత్యేకంగా ఆకుపచ్చ, ఎరుపు రంగుల కోడ్ ఇస్తున్నట్లుగా దీనిని అమలు పరచే ఆలోచన చేస్తున్నారు.

భారత్ లో తయారైన వస్తువులకు ఓరేంజ్ లేదా కాషాయం రంగులను అమలు చేసే అవకాశం ఉంది. ఇలా ఉండగా,  తమ వేదికలపై విక్రయిస్తున్న వస్తువులు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయో వెల్లడించాలి అంటూ కేంద్రం  ఈ కామర్స్ సంస్థలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. స్థానికంగా అదనపు విలువను జత చేస్తే వాటి వివరాలను కూడా తెలపాలని సూచించింది. ప్రభుత్వ ఈమార్కెట్ప్లేస్ (జీఈఎం) ఈ వివరాలను వెల్లడించడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

‘‘ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా జీఈఎం పలు కీలక చర్యలు తీసుకుంది. జీఈఎంలో నమోదు  చేసుకునే సమయంలో అన్ని ఉత్పత్తులకు సంబంధించిన మూలమైన దేశం గురించి తెలపడం తప్పనిసరిగా  చేసింది. ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాకముందే తమ ఉత్పత్తులను అప్లోడ్ చేసిన అమ్మకందారుల  కూడా వాటి మూలాలను ఎప్పటికప్పుడు   అప్డేట్ చేయాలని ఆదేశించింది. 

ఒకవేళ ఈ విషయంలో ఆ సంస్థలు విఫలమైతే  వాటి ఉత్పత్తులను జీఈఎం నుంచి తొలగిస్తామని జీఈఎం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో అమెజాన్, ఫ్లిఫ్కార్ట్, పేటీఎం మాల్ వంటి ఈ–టెల్లర్స్ వంటి సంస్థలు కూడా నిబంధనలను అమలు కావలసిందే అని స్పష్టం చేసింది. 

ప్రతిపాదిత ఈ కామర్స్ పాలసీలో కూడా గతంలో ఇవే ప్రతిపాదనలను అమలు చేశారు. తక్కువ రేటు కలిగిన వస్తువులను అమ్మేందుకు ఈ సంస్థలు చైనా కంపెనీలపై ఆధారపడుతున్నాయని, స్థానిక  వస్తువులకు ప్రోత్సాహం కల్పించేందుకు, వాటికి మార్కెట్ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారి తెలిపారు.