
శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సంసద్‌రత్న అవార్డుకి ఎంపికయ్యారు. పార్లమెంటు సభ్యునిగా కనబరచిన అత్యుత్తమ పనితీరు, ప్రజాసమస్యల పరిష్కారానికి చూపిస్తున్న చొరవని గుర్తించిన జ్యూరీ కమిటీ ప్రత్యేక అవార్డు ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా 8మంది పార్లమెంటు సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులను 2019-20 సంత్సరానికి ఎంపికచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున రామ్ మేఘవాలా అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది.
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి తగ్గి లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం అవార్డల ప్రధానోత్సవం ఉంటుందని ప్రైమ్ పాయింట్ ఫౌంఢేషన్, సంసద్‌రత్న అవార్డుల కమిటీ ఛైర్మన్ కె. శ్రీనివాసన్ తెలిపారు.
రాజకీయ ప్రముఖులు శశిథరూర్, సుప్రియ సులే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోనుండటం చాలా ఆనందంగా ఉన్నదని రామ్మోహన్‌నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలు, కింజరాపు కుటుంబ వారుసునిగా ప్రజాసేవలో ఉన్న తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎంపిగా తాను చేసిన సేవలను గుర్తించిన ప్రజలే తనను మళ్లీ ఎంపిగా ఎన్నుకున్నారని చెబుతూ అ అవార్డును వారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. పురస్కారంతో తన భాద్యత మంరిత పెరిగిందని తెలిపారు.
More Stories
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష ఆరోపణలపై కిషన్ రెడ్డి ఆగ్రహం
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను