అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. హెచ్1బీ వీసాల జారీపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుండి ఈ వీసాల జారీ లాటరీ పద్దతిన కాకుండా ప్రతిభ ఆధారంగా ఉంటుందని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.
ఒకవైపు పెరిగిపోతున్న నిరుద్యోగుల సంఖ్య, మరోవైపు వేగంగా దూసుకొస్తున్న అధ్యక్ష ఎన్నికలు, ఇంకో వైపు కరోనా వల్ల మందగించిన ఆర్థిక వృద్ధి.. వీటన్నింటితోను సతమతమవుతున్న ట్రంప్ అమెరికాలోని విదేశీ నిపుణులపై గురిపెత్తిన్నట్లు కనబడుతున్నది.
అమెరికాలోని స్థానికులకు ఉద్యోగఅవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యం గల వారికి మాత్రమే దేశంలో చోటిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ఈనెల 24వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం అమలు చేసేందుకు గాను కొత్త హెచ్1బీ వీసాల జారీపై డిసెంబర్ 31వ తేదీ వరకు నిషేధం విధించారు.
ఇప్పటి వరకు లాటరీ విధానంలో వీసాలను జారీ చేసేవారు. ఇక నుండి గరిష్ట వేతన స్థాయి ఆధారంగా జారీ చేయనున్నామని అమెరికన్ అధికారులు తెలిపారు.
సంస్కరణల్లో భాగంగా అత్యధిక వేతనాలు పొందే వారికి మాత్రమే హెచ్1బీ వీసాల జారీలో పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. అమెరికా ఉద్యోగులను చౌకగా దొరికే ఇతర దేశాల ఉద్యోగులతో భీర్త చేసే విధానాన్ని మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.
More Stories
గాజాలో 19న మొదటి విడత బందీల విడుదల!
ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ళు, భార్యకు 7 ఏళ్ళు జైలు
రష్యా తరుఫున యుద్ధంలో 12 మంది భారతీయులు మృతి