హ‌జ్ యాత్రికుల‌ను పంప‌డం లేదు

ఈ ఏడాది భార‌త్ నుంచి హ‌జ్ యాత్ర‌కు వెళ్లే వారికి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ తెలిపారు.  2020 హ‌జ్ యాత్ర‌కు భార‌తీయుల‌ను పంప‌డం లేద‌ని మంత్రి చెప్పారు.  

ఈ సారి హ‌జ్ యాత్రం కోసం 2.3 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. వారి డ‌బ్బును తిరిగి చెల్లించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.  ఆ డ‌బ్బును నేరుగా ద‌ర‌ఖాస్తుదారుడి ఖాతాల్లోకి పంప‌నున్న‌ట్లు న‌ఖ్వీ వెల్ల‌డించారు. 

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఇత‌ర దేశాల నుంచి వ‌స్తున్న యాత్రికుల‌కు ఈ సారి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని కూడా సౌదీ అరేబియా ప్ర‌క‌టించింది. మాక్కాను సందర్శించేందుకు కొద్ది మంది సౌదీ నివాసితుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ఆ ప్ర‌భుత్వం సోమ‌వారం స్ప‌ష్టం చేసింది.  

సాంఘిక దూరం సూత్రాల‌కు అనుగుణంగా యాత్ర ఉంటుంద‌ని పేర్కొన్న‌ది. ప్ర‌పంచ‌దేశాల‌కు చెందిన ముస్లింలు.. హ‌జ్ యాత్ర‌లో పాల్గొన‌క‌పోవ‌డం ఇదే తొలిసారి అవుతుంది.

జీవిత‌కాలంలో ఒక‌సారైనా హ‌జ్‌కు వెళ్లాల‌ని ముస్లిం సోద‌రులు భావిస్తుంటారు. కానీ ఈ ఏడాది వారి ఆశ‌ల‌కు క‌రోనా వ‌ల్ల గండిప‌డిన‌ట్లు అయ్యింది. సౌదీకి చెందిన హ‌జ్ అండ్ ఉమ్రా మంత్రిత్వ‌శాఖ ఈ ప్ర‌క‌ట‌న చేసింది.