చివరకు తోక ముడుస్తున్నట్లు చైనా ప్రకటన 

భారత్ భూభాగాలను ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తున్న చైనా ఎట్టకేలకు తోకముడిచింది. భారత భూభాగం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నట్లు తెలిపింది. దాదాపు 11గంటల పాటు చైనా కు చెందిన మోల్డో ప్రాంతంలో భారత్ – చైనాల మధ్య సామరస్య చర్చలు జరిగినట్లు, ఆ చర్చల అనంతరం డ్రాగన్ వెనక్కి తగ్గినట్లు భారత్ సైన్యంకు  చెందిన సీనియర్ అధికారులు వెల్లడించారు.

తూర్పు లడఖ్ యొక్క గాల్వన్ వ్యాలీలో భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) నుండి సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణ తరువాత ఈ సమావేశం జరిగింది.

ఈ భేటీలో మనదేశం నుంచి  లేహ్ కు చెందిన 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా నుంచి సౌత్ జిన్జియాంగ్ మిలట్రీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వంలోని ప్రతినిధుల  ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై రాత్రి 10.15 వరకు చర్చలు జరిగాయి.

భారత భూభాగంలో ఉన్న  పాంగోంగ్ త్సో నది ఒడ్డున చైనా ఏర్పాటు చేసుకున్న స్థావరాల్ని తొలగించాలని భారత్ డిమాండ్ చేసిన్నట్లు సైనిక స్థాయిలో చర్చలు తెలిసిన ఇద్దరు అధికారులు తెలిపారు. జూన్ 15 న గాల్వన్ వ్యాలీ వద్ద ఘోరమైన ఘర్షణ తరువాత, మే 5-6 న పాంగోంగ్ త్సోలో మరో ముఖాముఖి జరిగిన తరువాత సరిహద్దు వెంబడి ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నాల్ని విరమించుకుంటున్నట్లు చైనా హామీ ఇవ్వాలని స్పష్టం

చేశారు . ఇరు దేశాల సైనికుల ఘర్షణల సమయంలో, చైనా సైనికులు అధిక సంఖ్యలో గుమి గూడి, భారత సైనికులపై ఇనుప కంచెలతో దాడి చేశారని , అలా మరోసారి దాడులు చేస్తూ భూభాగంలోకి వచ్చే ప్రయత్నాలు చేయకుండా తమకు హామీ ఇవ్వాలని భారత్ డిమాండ్ చేసింది. దీంతో భారత్ డిమాండ్లపై చైనా వెనక్కి తగ్గిందని, మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాల్ని విరమిస్తున్నట్లు  చైనా తెలిపిందని భారత సైన్యానికి చెందిన ముఖ్య అధికారులు వెల్లడించారు.