అమెరికా సైన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా భారతీయుడు 

అమెరికాలో మన భారతీయుడికి అరుదైన ఘనత దక్కింది. ఆ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌)కు డైరెక్టర్‌గా డాక్టర్‌ సేతురామన్‌ పంచనాథన్‌ను నియమిస్తున్నట్లు యు.ఎస్.సెనేట్ ధృవీకరించింది.

భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ ను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధిపతిగా ఎంపికైన రెండవ భారతీయయుడు. అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన 58 ఏండ్ల పంచనాథన్  అమెరికన్ సైన్స్ ఫండింగ్ బాడీ ఎన్‌ఎస్‌ఎఫ్‌కు వార్షిక బడ్జెట్ 7.4 బిలియన్ డాలర్ల ఉన్నది. దీనికి ఆయన నాయకత్వం వహిస్తారు.

పరిశోధన, ఆవిష్కరణ, విద్యా పరిపాలన రంగాల్లో అపార అనుభవం ఉన్న డాక్టర్‌ సేతురామన్‌ పంచనాథన్‌ ఈ పదవికి వన్నె తెస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ అమెరికన్‌ అయిన ఆయన కంప్యూటర్‌ శాస్త్రవేత్తగా పేరుతెచ్చుకు న్నారు. ప్రస్తుతం అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు.

ఫ్రాన్స్ కార్డోవాలోని ఆరేళ్ల పదవీకాలం మార్చిలో ముగిసింది. దీంతో ఆయన్ను ఎన్‌ఎస్‌ఎఫ్ 15 వ డైరెక్టర్‌గా నియమించారు . తమిళనాడుకు చెందిన సేతురామన్‌ 1984లో బెంగళూరు ఐఐఎస్‌సీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ అభ్యసించారు. 1986లో ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు.

1989లో కెనడాలోని అట్టావా యూనివర్శిటీలో ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. జూలై 6 న పంచనాథన్ ఎన్‌ఎస్‌ఎఫ్ కు డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.