ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో భారత్‌కు మద్దతుగా నిలిచిన 184 దేశాలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రాత్రి ఎన్నికల్లో 193 దేశాల ఓట్లు పోల్ కాగా, భారత్ 184 ఓట్లతో విజయం సాధించింది. దీంతో ఏకగ్రీవంగా భారత్ ఈ ఎన్నికల్లో గెలిచినట్లయింది.
ఈ విజయం భారత్‌కు భారత్ కు గొప్ప పరిణామమని మోడీ పేర్కొన్నారు. భారత్‌కు మద్దతిచ్చిన దేశాలకు సోషల్‌మీడియా వేదికగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. పోటీ లేకుండానే భారత్‌ను గెలిపించారని, తమ దేశానికి దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, సభ్య దేశాలతో కలిసి పని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం, సామరస్యం, భద్రత, సమానత్వం తదితర హక్కుల కోసం తమ పంథాను కొనసాగిస్తామని ప్రధాని చెప్పారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఎన్నికైన భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా అభినందనలు తెలిపింది. భారత్‌లో ఉన్న అమెరికా రాయబారి కెన్ జెస్టర్ భారత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మరింత స్థిరమైన, భద్రమైన, దేదీప్యమాన భవిషత్తు కోసం భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కెన్ జెస్టర్ తెలిపారు.
ఐక్యరాజ్యసమితి ఎన్నికలో సహకరించిన ప్రతి దేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ దేశాల బలోపేతానికి భారత్ కట్టుబడి పనిచేస్తుందని రాజ్‌నాథ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు,
More Stories
కంగనా విచారణకు హాజరు కావాలని చండీగఢ్ కోర్టు నోటీసు
పదేళ్ల తర్వాత నేడే జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్