ఆక్సాయ్‌‌ చిన్‌ ప్రాంతం మనదే  

ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌‌ చిన్‌ ప్రాంతం మన సరిహద్దుల్లోనే ఉందని, దాన్ని తిరిగి వెనక్కి తీసుకురావాల్సిన సమయం వచ్చిందని లఢఖ్‌ బీజేపీ ఎంపీ జమ్యాంగ్‌ సెరింగ్‌ నంగ్యాల్‌  స్పష్టం చేశారు. 

‘ఒక్క ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతమేకాదు..గిల్గిట్‌, బాల్టిస్తాన్‌ ప్రాంతాలు కూడా లడఖ్‌లోనివే. ఇప్పటి భారత్ 1962లాగా లేదు.’ అని ఆయన చైనానుద్దేశించి హెచ్చరించారు.

సరిహద్దుల్లోని స్థానికుల గురించి ఆయన మాట్లాడుతూ, చైనా నిరాకరించిన సాంప్రదాయ పచ్చికబయళ్లలోకి గొర్రెల కాపర్లు మళ్లీ తిరిగి వెళ్తారని, ఆ ప్రాంతాలన్నింటిని తిరిగి పొందుతామని నంగ్యాల్‌ ధీమా వ్యక్తంచేశారు. 

లడఖ్‌లోని స్థానికుల రక్షణ కోసం సరిహద్దు ప్రాంతంలో తాము పెద్ద పాత్ర పోషించాలనుకుంటున్నామని చెప్పారు. గాల్వన్‌ లోయలో జరిగిన చైనా దాడిలో కల్నల్‌ సహా 20 మంది మరణించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.