భారత సరిహద్దులో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహన్ని లేహ్ నుంచి ప్రత్యేక విమానంలో హాకీంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చారు. అంతకుముందే హకీంపేట్‌కు చేరుకున్న గవర్నర్ తమిళిసై, కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి నివాళులర్పించారు. గవర్నర్‌తోపాటు మంత్రులు కెటిఆర్, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు ఆయనకు నివాళి అర్పించారు.
ఆర్మీ అధికారుల గౌరవ వందనం తర్వాత భౌతికకాయాన్ని రోడ్డు మార్గం ద్వారా సూర్యాపేటలోని నివాసానికి తరలించారు. కల్నల్ భార్య, పిల్లలను మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి తీసుకొచ్చారు.
గురువారం ప్రభుత్వ లాంఛనాలతో కేసారంలోని వ్యవసాయ భూమిలో క అంత్యక్రియలు నిర్వహింనున్నారు. భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబుతో పాటు 20 మందికి పైగా భారత జవాన్లు వీరమరణం చెందారు. వీరికి నివాళులర్పించిన భారత ప్రభుత్వం… మృతదేహాలను స్వస్థలాలకు తరలించింది.
ఢిల్లీ నుంచి సంతోష్‌బాబు భార్య సంతోషిని, కుమారుడు, కుమార్తెను ఆర్మీ అధికారులు ప్రత్యేక విమానంలో ఉదయమే హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సైబరాబాద్ సిపి సజ్జనార్, డిసిపి ప్రకాశ్‌రెడ్డి వారిని ఓదార్చారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆర్మీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు.
More Stories
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
ఒకవైపు ప్రజాపాలన దినోత్సవాలు.. మరోవైపు విముక్తి దినోత్సవాలు
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర