కాణిపాకం ఆలయం మూసివేత

చిత్తూరు జిల్లా కాణిపాక ఆలయంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో సోమవారం ఆ ఆలయాన్ని మూసివేశారు. రెండు రోజుల అనంతరం ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ ఇఒ వెంకటేష్‌ తెలిపారు. 
 
లాక్‌డౌన్‌లో భాగంగా 77 రోజుల పాటు ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు ఈ నెల 8, 9 తేదీల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి 10 తేదీ నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయంలో సుమారు 500 మంది సిబ్బంది వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఈ నెల 12న తొలివిడత 60 మంది ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఆ హోంగార్డు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడు అని అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల అనంతరం భక్తులకు పునర్ధర్శనం కల్పించనున్నారు.