
రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, కోవిడ్ మహమ్మారిపై పోరు సలపాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్ని పార్టీలకూ పిలుపునిచ్చారు. కేంద్రం విధించిన కోవిడ్ నిబంధనలు క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చూడాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అమిత్‌షా సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
‘‘రాజకీయ విభేదాలను మరిచిపోండి. అన్ని రాజకీయ పక్షాలూ ఢిల్లీ ప్రజల కోసం కలిసి మెలిసి పనిచేద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కలిసి పనిచేస్తూ.. మహమ్మారిపై పోరాడదాం’’ అని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఢిల్లీ ప్రజలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి షా, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలోని ప్రజలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పట్టుబట్టింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇంటింటా సర్వే నిర్వహించడంతోపాటు పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆయన కేంద్ర, ఢిల్లీ సర్కారుతోపాటు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు.
More Stories
ఇక ఆన్లైన్లోనే సినిమాలకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఎనిమిదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల రక్షణ సామగ్రి