తమిళనాడులో మరోసారి లాక్‌డౌన్‌ 

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాలో మరోసారి పూర్తిగా
  లాక్‌డౌన్‌    విధిస్తూ  రాష్ట్ర ప్రమంత్రివర్గం ‌ సోమవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, చంగల్‌పట్టు, తిరువెళ్లూర్‌లో జిల్లాలో ఈనెల 19నుంచి 30 వరకు  లాక్‌డౌన్‌   ‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
లాక్‌డౌన్‌ సమయంలో ఆయా జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి 2గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 33శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది.
 
 ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అత్యవరస పరిస్థితుల్లో మాత్రమే ఆటోలు, టాక్సీలకు అనుమతి ఉంటుందని సూచించింది.
 
 కాగా, తమిళనాడులో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 1,974 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రసుతం రాష్ట్రంలోకరోనా సోకినవారి సంఖ్య 44, 661కు చేరింది. కరోనా బారినపడి ఇప్పటి వరకు 435 మంది చనిపోయారు.