ఎలక్ట్రానిక్స్ హబ్  గా భారత్  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన `భారత్ లో తయారు’ ఘన విజయం సాధించిన రంగంలలో 2014 నుండి భారత్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో సాధించిన పురోగతిని ప్రధానంగా పేరొనవచ్చు.  2014లో 29 బిలియన్ డాలర్ల విలువ గల ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేస్తుండే భారత్ 38 బిలియన్ డాలర్ల విలువ గల వస్తువులను దిగుమతి చేసుకొంటూండేడిది. 

2018-19 నాటికి వీటి ఉత్పత్తులు 70 బిలియన్ డాలర్లకు పెరగగా, దిగుమతలు 57 మిలియన్   డాలర్లకు  పెరిగాయి.  మొబైల్ ఫోన్ల ఉత్పత్తులు  2.9 బిలియన్ డాలర్ల నుండి 24.3 బిలియన్ డాలర్లకు పెరగడమే అందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. నేడు ప్రపంచంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. 
 
కంప్యూటర్ హార్డ్ వేర్, వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్, వినియోగ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, పారిశ్రామిక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ ఉత్పత్తుల కారణంగా  ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలిగాయి. 
 
ఈ విజయాలతో లభించిన ప్రోత్సాహంతో ప్రభుత్వం ఇప్పుడు  కేవలం స్వదేశీ వినియోగం కోసమే కాకుండా, ఎగుమతులకు కూడా భారత్ ను మొబైల్, సంబంధిత పరికరాల తయారులో ప్రపంచ కేంద్రంగా మార్చడం పట్ల దృష్టి సారించింది. 2019 జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానంలో పొందుపరచిన విధంగా `భారత్ లో తయారు’ కోసం ప్రపంచంలో ప్రముఖ కంపెనీలను, సరఫరా చైన్ లను ఆకట్టుకొనే ప్రయత్నం జరుగుతుంది. 
 
మొబైల్ ఫోన్లతో పాటు 2014-15 నుండి 2018-19ల మధ్య అభివృద్ధి చెందిన కీలక రంగాలలో ఎల్ సి డి/ లెడ్ టివిలు, ఇతర లెడ్ ఉత్పత్తులు, ఆటో ఎలక్ట్రానిక్ లు, వైద్యపర ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్, వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్ (రక్షణ అవసరాలు), టెలికాం ఉత్పత్తులు కూడా ఉన్నాయి. వచ్చే సంవత్సరాలలో ఉత్పత్తులను పెంపొందించడం కోసం ప్రభుత్వం దృష్టి సారిస్తున్న రంగాలలో ఇవి ఉన్నాయి.

ఈ లక్ష్య సాధన దిశలో కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ లో నూతన పధకాలను ప్రకటించింది. ఆ పధకాల వివరాలను కేంద్ర ఐటి మంత్రి రవి శంకర్ ప్రసాద్ జూన్ 2న వివరించారు. ఈ మూడు పధకాల ధ్వారా   ఎలెక్ట్రినిక్స్   పరిశ్రమను 2025 నాటికి వేగంగా అభివృద్ధి చేయడంతో పాటు 15 నుండి 20 లక్షల నూతన ఉద్యోగాలను కల్పించడం కోసం ఉద్దేశించారు. 
 
నూతన పధకాలు: ఉత్పత్తితో అనుసంధానం చేసిన ప్రోత్సాహకాలు,  కంపోనెంట్లు, సెమికండక్టర్లు ఉత్పత్తి, ఎలక్ట్రానిక్స్ తయారు క్లస్టర్లు. : ఈ సందర్భంగా 2018-19లో 70 బిలియన్ డాలర్లుగా ఉన్న ఉత్పత్తులను 106 బిలియన్ డాలర్లుగా చేసే లక్ష్యంతో రూ 50,000 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించారు. 77 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 
ఉత్పత్తితో అనుసంధానం చేసిన ప్రోత్సాహకాల కింద 2019-20ని ప్రాతిపదికగా చేసుకొని భారత్ లో తయారు చేసిన వస్తువుల పెంచిన అమ్మకాలపై 4 నుండి 6 శాతం ప్రోత్సాహకాలను2025 వరకు అందిస్తారు.   సెమికండక్టర్లు   ఉత్పత్తి, ఎలక్ట్రానిక్స్ తయారు క్లస్టర్ల పధకంలో కొన్ని వస్తువుల ఉత్పత్తిలో కాపిటల్ వ్యయంపై 25 శాతం ప్రోత్సాహం అందిస్తారు. 
 
ఈ ప్రోత్సాహం లభించే వస్తువులు: ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్లు, సెమికండక్టర్లు/ ప్రదర్శించే ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, ఎటిఎంపి యూనిట్లు, నైపుణ్యత గల ఉప అసెంబ్లీ యూనిట్లు వంటివి.
 
క్లస్టర్ల ప్రోత్సాహంకు ఉద్దేశించిన మూడో పధకం క్రింద ప్రభుత్వం అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారు కంపెనీలు భారత దేశంలో యూనిట్లు ఏర్పాటు చేయడం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. వారి ప్రధాన తయారు సదుపాయాలు ఏర్పరచుకోవడం కోసం సదుపాయాలు కల్పిస్తారు. 
 
చైనా, కొరియా, జపాన్ ల స్థాయిలో ఈ పధకాల ద్వారా భారత్ లో ఎలక్ట్రానిక్స్ తయారును పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 10 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంపై రూ 5.8 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.