విద్యుత్ పోరులో బిజెపి నేతల అరెస్ట్ 

 
ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖపు విధానాల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ, అశాస్త్రీయ పద్ధతులతో పేద, మధ్య  తరగతి ప్రజలపై విద్యుత్‌ బిల్లుల రూపంలో భారం మోపుతోందని మండిపడ్డారు. 
 
అసంబద్ధమైన బిల్లుల్ని మాఫీ చేయాలనే డిమాండ్‌తో సోమవారం బీజేపీ తలపెట్టిన ఆందోళనలో భాగంగా బండి సంజయ్‌, రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి విద్యుత్‌ సౌధ వద్దకు బయల్దేరారు. ఆందోళన పిలుపు నేపథ్యంలో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు బండి సంజయ్‌తో పాటు ముఖ్యనేతల్ని అరెస్టు చేసి, అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
 ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు బయటకు రాలేదని, ఉపాధి, ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని మూడు నెలల పాటు ఆర్థికంగా చికితిపోయిన జనానికి ఊరట కలిగించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో నెత్తిన పిడుగు వేసిందని సంజయ్ మండిపడ్డారు. మూడు నెలలు వినియోగించిన యూనిట్లను సగటు చేయడం ఎక్కడి విధానమో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు.
 ప్రజల్ని దోచుకోవాలనే దురుద్దేశంతోనే దోపిడీ విధానాలకు రూపకల్పన చేశారని బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అరెస్టులకు పాల్పడం ఏంటని ప్రశ్నించారు. నేతలంతా నిబంధనలకు లోబడి వ్యవహరించినా ప్రభుత్వం అరెస్టులు చేయించడం దారుణమని మండిపడ్డారు.
రాష్ట్రంలో 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వినియోగదారుల సంఖ్య కోటి 15 లక్షలు మాత్రమే ఉంటుందని సంజయ్‌ తెలిపారు. కానీ వినియోగదారులందరిపై ఇష్టానుసారంగా భారం మోపడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రజలకు పాలన అందించాల్సిన ప్రభుత్వం వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టుగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రైవేటు ఫైనాభావిస్తున్నదని దుయ్యబట్టారు. 
 
 ప్రభుత్వం ప్లాన్‌ ప్రకారమే అక్రమ విధానాలతో ప్రజల నుంచి రూ.300 కోట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజలు సోషల్‌ మీడియా, మీడియా ద్వారా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అవాస్తవాల్ని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
 
హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోని విద్యుత్‌ ఆఫీసుల ముందు ధర్నాలకు పిలుపునిచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు, కోర్‌ కమిటీ సభ్యుల్ని పోలీసులు గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో వేధింపులకు గురి చేశారని  మండిపడ్డారుసంజయ్‌ . బీజేపీ నేతలకు అరెస్టులు కొత్త కాదని అంటూ ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు, ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే వాతావరణం కూడా లేకపోవడం దారుణమని విమర్శించారు.