భారత్ – చైనా సరిహద్దులో ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో చైనా నిపుణుడు ఒకరు భారత సైనిక సామర్ధ్యాన్ని బహిరంగంగా ప్రశంసించాడు. “ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విస్తారమైన, అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన పర్వత దళాలు అమెరికా, చైనా, మరే ఐరోపా దేశాల వద్ద లేవు. కేవలం భారత్ వద్ద మాత్రమే ఉన్నాయి” అంటూ కొనియాడాడు. చైనా నుండి ప్రచురించే ఆధునిక ఆయుధాల పత్రిక సీనియర్ ఎడిటర్ హుయాంగ్ గువోజహి వ్రాసిన వ్యాసంలో ఈ అంశం ప్రస్తావించాడు. బహుశా మొదటి సారిగా ఒక చైనా నిపుణుడు భారత సైనిక సామర్ధ్యాన్ని, బలాన్ని బహిరంగంగా ప్రశంసించడం జరిగింది. తూర్పు లడఖ్ లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని బేధాభిప్రాయాలు అంగీకరించాలని 1970వ దశకం నుంచి భారత సైన్యం పర్వత దళాలను ఏర్పరచి, పెద్ద ఎత్తున విస్తరింప చేసుకొంటూ వస్తున్నది. 50,000 మందికి పైగా సైనికులతో పర్వతాలపై యుద్దాలు చేసే దళం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని హుయాంగ్ తెలిపాడు “భారత పర్వత డలంలలో దాదాపు ప్రతి సభ్యునికి పర్వతారోహణ అనేడిది అత్యవసరమైన నైపుణ్యం. అందుకనే భారత దేశం పర్వతారోహణ వృత్తిగా గలవారిని, పర్వతోరోహన పట్ల ఆసక్తి గలవారిని ప్రైవేట్ రంగం నుండి చేర్చుకొంటున్నది” అని చెప్పుకొచ్చారు. సియాచిన్ మంచు పర్వత ప్రాంతంలో భారత సైన్యం నెలకొనడాన్ని ప్రస్తావిస్తూ “సియాచిన్ మంచు పర్వతం ప్రాంతంలో 5,000 మీటర్లకు పైగా ఎత్తులో భారత సైన్యం 6,000 నుండి 7,000 మంది వరకు సేనలను మోహరింప చేసి, అనేక అవుట్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది. అతి ఎత్తున ఉన్న పోస్ట్ 6,749 అడుగులలో ఉన్నది” అని వివరించాడు. సేకరణ, దేశీయ పరిశోధన, అభివృద్ధి ద్వారా ఎత్తైన, పర్వత కార్యకలాపాల వాతావరణానికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలతో భారత సైన్యం సన్నద్ధమైందని తెలిపాడు. భారత సైన్యం అమెరికా నుండి అధునాతన భారీ పరికరాల కోసం భారీగా ఖర్చు చేసింది,. వీటిల్లో తన కాల్పుల సామర్ధ్యం పెంపొందించుకొనే విధంగా, దాడులను తిప్పొకొట్టగల సామర్ధ్యం గల ఎం 777, ప్రపంచంలోని తేలికైన 155 మిమీ హోవిట్జర్ , తుపాకీని ఎత్తే చినూకీవీ రవాణా హెలికాప్టర్ వంటివి ఉన్నాయని వివరించాడు.
“అదనంగా, భారత సైన్యం, వైమానిక దళముల మధ్య అనేక భిన్నత్వాలున్నాయి. ఇది వైమానిక దళం నుండి లభించే మద్దతుపై ఆధారపడకుండా తనకు సొంతంగా అమెరికాలో తయారు చేసిన ఎఎచ్ – 64ఇ లాంగ్బో అపాచీ దాడి హెలికాప్టర్లను సిద్ధం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది” అని హుయాంగ్ వ్రాసాడు.
ఇటువంటి వాతావరణంలో, పోరాటదారులు తమ సొంత వెచ్చని రక్షణను చేసుకోవడమే కాకుండా, అల్పపీడనం, మరియు హైపోక్సియా కారణంగా సెరిబ్రల్ పల్మనరీ ఎడెమా వంటి వాతావరణ సంబంధ అనారోగ్యాలను నివారించుకొనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.
|
|
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!