నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లకు ఈడీ షాక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ.14, 000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లకు ఈడీ షాక్ ఇచ్చింది. వాళ్లిద్దరీ అధీనంలో నడుస్తున్న కంపెనీలకు చెందిన రూ. 1350 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది.
 
 2018 లో దేశం నుంచి పరారైన సమయంలో ఈ అభరణాలను హాంకాంగ్ నుంచి దుబాయ్ కు తరలించాలని నీరవ్ మోడీ ప్లాన్ చేశారు. దర్యాప్తు సంస్థలను మోసం చేసి వీటిని దుబాయ్ కు పంపించాలని భావించారు. ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో హాంకాంగ్ లో ఉన్న ఆభరణాలను దుబాయ్ కి షిప్పింగ్ చేయకుండాఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అడ్డుకుంది. 
 
ఆ ఆభరణాలను మనదేశానికి తెప్పించేందుకు కొన్ని రోజులుగా ఈడీ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఆ ఆభరణాలను హాంకాంగ్ నుంచి ముంబై కి తీసుకొచ్చారు. మొత్తం 108 ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఉన్న వీటిలో 32 నీరవ్ మోడీ కి చెందిన కాగా, 76 ఆభరణాల ప్యాకెట్లు మెహిల్ చోక్సి కి చెందినవని గుర్తించారు. 
 
వీటిలో పాలిష్ చేసిన డైమండ్లు, ముత్యాలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటి బరువు 2300 కిలోలు ఉంది. ఈడీ స్వాధీనం చేసుకున్న ఈ ఆభరణాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే నీరవ్, చోక్సీలకు సంబంధించిన పలు ఆస్తులను ఈడీ ఆటాచ్ చేసింది. లండన్ లో ఉన్న వీరిని మనదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.