
జీవన వ్యయం పరంగా భారత ఆర్థిక రాజధాని ముంబై విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఆవిర్భవించింది. ఈ విషయంలో ముంబై ప్రపంచంలో 60వ స్థానంలోనూ, ఆసియా ఖండంలో 19వ స్థానంలోనూ నిలిచినట్టు మెర్సర్-2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే వెల్లడించింది.
భారత్‌లో ముంబై తర్వాత ఈ జాబితాలో న్యూఢిల్లీ (ప్రపంచంలో 101వ స్థానం), చెన్నై (143), బెంగళూరు (171), కోల్‌కతా (185) ఉన్నాయి. భారత్‌లో మెర్సర్ సర్వే చేసిన అన్ని నగరాలు ఈ జాబితాలో కనీసం నాలుగు స్థానాలు ఎగబాకాయి. అయితే న్యూఢిల్లీ మాత్రం ఏకంగా 17 ర్యాంకులు మెరుగుపర్చుకొన్నప్పటికీ ప్రపంచ టాప్-100 నగరాల జాబితాకు తృటిలో దూరమైంది.
ప్రపంచ జాబితాలో హాంకాంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో అస్ఘబాట్ (తుర్క్‌మెనిస్థాన్), టోక్యో (జపాన్), జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), సింగపూర్ ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి సింగపూర్ రెండు స్థానాలు దిగజారింది. ఈ ఏడాది ప్రపంచ టాప్-10 నగరాల జాబితాలో న్యూయార్క్ (అమెరికా), షాంఘై (చైనా), బెర్న్, జెనీవా (స్విట్జర్లాండ్), బీజింగ్ (చైనా) వరుసగా 5 నుంచి 10 స్థానాల్లో నిలిచినట్టు మెర్సర్ వెల్లడించింది.
ప్రపంచంలో జీవన వ్యయం తక్కువగా ఉన్న నగరాల జాబితాలో ట్యునిస్ (ట్యునీషియా), విండ్‌హోక్ (నమీబియా), తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్), బిష్కెక్ (కిర్గిస్థాన్), కరాచీ (పాకిస్థాన్) ఉన్నట్టు మెర్సర్ తెలిపింది.
More Stories
అసలు బంగారమే స్వాధీనం చేసుకోలేదు… రన్యా రావు
నటి రన్యారావుకు బెయిల్ నిరాకరణ
ఛాంపియన్స్ ట్రోఫీ వ్యూయర్షిప్లో సరికొత్త రికార్డు