యోగి ఆదిత్యనాథ్ కు పాక్ మీడియా ప్రశంసలు 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై పాకిస్థాన్ లోని ప్రముఖ మీడియా సంస్థ డాన్ ప్రశంసల వర్షం కురిపించింది. యూపీలో ఎంతమంది ప్రజలున్నారో పాక్ లో అదే స్థాయిలో ప్రజలున్నారు. కానీ యూపీ సీఎం కరోనాని ఎలా అరికట్టారో చూడండి. మీరు మాత్రం కరోనాని కట్టడి చేయలేకపోతున్నారంటూ డాన్ పత్రిక ..ఆ దేశ  ప్రభుత్వాన్ని విమర్శించింది.

ఈ సందర్భంగా డాన్ పత్రిక ఎడిటర్  ఫహద్ హుస్సేన్ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ ను ఖచ్చితంగా అమలు చేసినందుకు యూపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. కరోనాను అడ్డుకోవడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

పాకిస్తాన్- ఉత్తర ప్రదేశ్ లో కరోనావైరస్ మరణాల సంఖ్యను పోలుస్తూ హుస్సేన్ ఒక గ్రాఫ్‌ను ట్వీట్ ను షేర్ చేశారు. భారత్ లో ఓ రాష్ట్రమైన యూపీలో కంటే  పాక్ లో ఎక్కువ మరణాలున్నాయి.  మహారాష్ట్రలో  జనాభా,  జీడీపీ / తలసరి అధిక రేటు ఉన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. యూపీ సీఎం ఏం చేశారో మనం తెలుసుకొని ఇక్కడ అమలు చేయాలి.  కరోనా విషయంలో  మహారాష్ట్ర తప్పు చేసింది అని ఆయన ట్వీట్ చేశారు.

ఫహద్ హుస్సేన్ షేర్ చేసిన  గ్రాఫ్ ప్రకారం, పాకిస్తాన్ జనాభా 20.8 కోట్లు కాగా, ఉత్తర ప్రదేశ్ లో 22.5 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. పాకిస్థాన్‌తో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ, యూపీలో చాలా తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఎలా కష్టపడుతున్నారో చర్చించి, సంక్షోభం నుండి ఎలా బయటపడాలనే దానిపై ‘మెసేజ్ దట్ మ్యాటర్’ అనే కథనం  తరువాత డాన్ ఎడిటర్ ఈ ట్వీట్ చేశారు. తాజా నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 1 లక్షకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, 2,172 మంది మృతి చెందారు.