పార్టీలు కొట్టుకొంటే … కోవిడ్ గెలుస్తుంది 

రాజకీయాలకు ఇది సమయం కాదు, విభేదించడానికి కూడా ఇది అదునైన సందర్భం కాదని అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీలకు హితవు చెప్పారు.    లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
 
కరోనా పోరుపై యావత్‌ దేశం ఐక్యంగా పోరాడాలని కోరుతూ    రాజకీయ పార్టీలు పేచీలు పెట్టుకుంటే, కరోనా విజయం సాధిస్తుందని, అప్పుడు మనం ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని  హెచ్చరించారు. 

సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లి, కరోనా టెస్టులు నెగటివ్‌ వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి వీడియో బ్రీఫింగ్‌లోమాట్లాడుతూ “కేంద్రం నిర్ణయించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ ఆదేశించారు. కాబట్టి కచ్చితంగా పాటించాల్సిందే” అని కేజ్రీవాల్‌ చెప్పారు.

ఢిల్లీ ప్రభుత్వ‌ పరిధిలోని హాస్పిట్సల్‌ను కేవలం లోకల్స్‌కు మాత్రమే రిజర్వ్‌ చేయాలని, బయటి నుంచి వచ్చేవారికి కేంద్రం పరిధిలోని హాస్పిటల్స్‌ను ఉపయోగించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం‌ నిర్ణయం తీసుకోగా దానిపై విమర్శలు వచ్చాయి. 

లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ బైజల్‌ కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకరించారు.  వలం కోవిడ్‌ లక్షణాలు చూపిస్తున్న వారిని మత్రమే పరీక్షించాలన్న నిబంధనను కూడా గవర్నర్‌ వ్యతిరేకించారు.దీనిపై స్పందిస్తూ   విబేధించడానికి ఇది సమయం కాదని కేజ్రీవాల్  తేల్చి చెప్పారు. 

అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిట్సల్‌లో పథకాలు కల్పించడం చేయడం ఒక ఛాలెంజ్‌ అనిపేర్కొన్నారు. ఈనెల 15 నాటికి ఢిల్లీలో దాదాపు 33వేల బెడ్లు అవసరం అవుతాయని, జులై చివరికి 1.5 లక్షల బెడ్లు అవసరం అవుతాయని తెలిపారు. దీని కోసం స్టేడియంలు, ఫంక్షన్‌ హాల్స్‌, హోట్సల్‌లో ఏర్పాట్లు చేస్తామని, ప్రజలకు కావాల్సినన్ని బెడ్లు ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.