స్వీయనిర్బంధంలోకి సీఎం కేజ్రీవాల్ 

ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. 

కేజ్రీవాల్‌కు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 28,936 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 812 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవాళ ఉదయం ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ మీడియాతో మాట్లాడుతూ రాబోయే రెండు వారాల్లో ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 56 వేలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. 

ప్రస్తుతానికి 8,500 నుంచి 9 వేల వరకు పథకాలు  సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 15 రోజుల్లో పడకల సంఖ్యను 15 వేల నుంచి 17 వేలకు పెంచుతామని తెలిపారు. కేంద్రం సరైన సమయంలో విమానాలను ఆపేసి ఉంటే తీవ్రత ఇంతగా ఉండేది కాదని పేర్కొన్నారు.