అమెరికా అధ్యక్ష ఎన్నకలలో డెమోక్రటిక్ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా ఖరారు అయ్యారు. నవంబర్‌లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ పోటీ చేయనున్నారు. తన పార్టీ అభ్యర్థిత్వానికి సంబంధించి నామినేషన్‌లో 1991 ఓట్లు గెలుచుకున్నట్లు బైడెన్ తన ట్విట్టర్‌లో తెలిపారు.
దేశ ఆత్మను కాపాడేందుకు ఇక తాను అధ్యక్ష పోరులో నిలవనున్నట్లు బైడెన్ ఆ ట్వీట్‌లో వెల్లడించారు. ఏప్రిల్‌లో పార్టీ పోటీ నుంచి బెర్నీ శాండర్స్ తప్పుకోవడంతో బైడెన్ కు మార్గం సులువైంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో జోసెఫ్ బైడెన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
డెమోక్రటిక్ రేసు కోసం బైడెన్ తొలుత ఐయోవా, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత దక్షిణ కరోలినాలో జరిగిన సభతో తన ప్రచార వేగాన్ని పెంచారు. ఇక క్రమంగా సూపర్ ట్యూజ్‌డే చర్చల్లో బైడెన్ డామినేట్ చేశారు.
14 కాంటెస్ట్‌లలో ఆయన పది గెలుచుకున్నారు. 77 ఏళ్ల బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ పడడం ఇది మూడవ సారి. దేశాధ్యక్షుడికి కావాల్సిన అన్ని అర్హతలు బైడెన్‌కు ఉన్నట్లు ఒబామా తెలిపారు.
More Stories
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
బంగ్లాదేశ్ లో నమాజ్ సమయంలో దుర్గాపూజపై ఆంక్షలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ జయకేతనం