
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 107 కేసులు నమోదయ్యాయి, ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చినవాళ్లు 49 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికుల్లో మరో 19 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది.
మిగతా కేసులు గ్రేటర్ హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లోనూ నమోదయ్యాయి. అయితే జిల్లాలవారీగా వివరాలు ఇవ్వలేదు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్య 2,098కి చేరింది. ఇప్పటివరకు 1,321 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 714 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. బుధవారం చనిపోయినవారిలో ఏడు రోజుల చిన్నారి, నాలుగు నెలల బాబు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ 27న!