ఆధార్ వివరాలతో తక్షణమే ఈ-పాన్‌ను కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రారంభించారు. పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సేవ పూర్తి ఉచితంగా లభిస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.
పాన్ కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం ను కేటాయించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. చెల్లుబాటయ్యే ఆధార్ నంబర్‌ను, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్‌ను కలిగివున్న దరఖాస్తుదారులకు ఈ సౌకచేసేందుకు నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్‌లోనే ఓ ప్రతిపాదన చేశారు.
అందులో భాగంగానే ప్రతిసారి అన్ని వివరాలతో దరఖాస్తును నింపాల్సిన అవసరం లేకుండా కేవలం ఆధార్ వివరాలతో ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు పాన్ నంబర్ర్యం అందుబాటులో ఉంటుందని, ఎలక్ట్రానిక్ పాన్ (ఈ-పాన్) ఉచితంగా లభిస్తుందని సీబీడీటీ వివరించింది.
ఇప్పటి వరకు పాన్ కార్డ్ పొందాలంటే కనీసం పది రోజులైన పట్టేది. ట్రాకింగ్ వివరాలు తెలియక కూడా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ.. ఇక క్షణాల్లో పాన్ కార్డు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.
Share:
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ