ఈ ఏడాది కొత్త పథకాలు ఉండవు 

లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ స్తంభించి పోవడంతో ఈ ఏడాది కొత్తగా ఎటువంటి పధకాలు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ఉదృతి నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ ఈ నిర్ణయం తీసుకొంది.  కొత్త స్కీమ్‌ల‌కు సంబంధించిన అభ్య‌ర్థ‌న‌ల‌ను కేంద్ర ఆర్థిక‌శాఖ‌కు పంప‌వ‌ద్దు అంటూ అన్ని మంత్రిత్వ‌శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ప్ర‌స్తుతం నిధుల కేటాయింపు కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ ప్యాకేజీకి మాత్ర‌మే ఉంటుంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ స్ప‌ష్టం చేసింది.  కొత్త స్కీమ్‌ల‌కు మాత్రం ఆమోదం ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇతర ఖర్చులను తగ్గించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

కరోనా విస్తరిస్తున్న తరుణంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని ఆమె చెప్పారు. అవసరమైన వాటికే నిధులు వాడాల్సిన అవసరముందని మంత్రి స్పష్టం చేశారు.

తాజా నిబంధనను ఉల్లంఘించి నిధులు కేటాయించాల్సి వస్తే ఖర్చుల శాఖ అనుమతి తీసుకుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు.   కోవిడ్‌19 నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిధుల‌కు ఎక్కువ డిమాండ్ ఉన్న‌ద‌ని, అయితే అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు తెలిపారు. కేంద్ర బ‌డ్జెట్ కింద ఇప్ప‌టికే కొన్ని స్కీమ్‌ల‌కు కేటాయించిన నిధుల‌ను కూడా నిలిపివేస్తున్న‌ట్లు ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది.