సమస్యల పరిష్కార వేదికగా  బీజేపీ కార్యాలయం 

సమస్యల పరిష్కార వేదికగా  బీజేపీ కార్యాలయం 
 
బీజేపీ మండల, జిల్లా కేంద్ర కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మారాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి. వి. ఎన్ మాధవ్ సూచించారు. ఒంగోలులో బీజేపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొంటూ ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకులు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకు వెడితే వాటి పరిష్కారం కోసం వారు కృషి చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేరువ కావాలని సూచించారు.
కూటమి ఎం. ఎల్. ఏ లు, యం. పి లు తమ కు గౌరవం ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతూ ప్రజల కోసం పని చేసి ప్రజలకు అండగా మనం నిలిస్తే ప్రజల అభిమానం పొందుతామని స్పష్టం చేశారు. అప్పుడు ఏ ప్రజా ప్రతి నిధి కూడా వారిని విస్మరించలేరని మాధవ్ తెలిపారు.  చేనేత కార్మికుల దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. 
రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి పథకాలకు కేంద్రమే నిధులు సమకూరుస్తుందని చెబుతూ కేంద్రం నుండి నేరుగా నగదు పంపినే చేసే పధకాలను కేంద్రం అమలు పరుస్తుందని గుర్తు చేశారు. వీధి దీపాల నుండి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు వరకూ వరకూ కేంద్ర నిదులే కారణం అని చెప్పారు.  14,15 ఆర్ధిక సంస్థల ద్వారా ఒకొక్క గ్రామానికి రూ. 10 కోట్ల వరకూ నిధులు సమకూరాయని మాధవ్ తెలిపారు. 
ప్రకాశం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ను   రూ. 500 కోట్ల తో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ జిల్లాకాలు కేంద్రం రూ 1400 కోట్ల నిధులు సమకూర్చిందని చెప్పారు. ఒంగోలు గిత్తల ప్రాధాన్యత దృష్ట్యా దేశం అంతా ఈ గిత్తల బ్రీడింగ్ కేంద్రం తీసుకొస్తుందని పేర్కొన్నారు. చీమకుర్తి గ్రానైట్ అభివృద్ధి కు కృషి చేస్తున్నామని వివరించారు.  బీజేపీ కార్యకర్తల గౌరవం పెరగాలి అంటే అంటే ప్రజా నాయకుడిగా మారాలని సూచించారు. జనధన్ అకౌంట్ లను రెన్యూవల్ చేయించుకోవాలని పిలుపు ఇచ్చారు.
దేశ భద్రత కోసం పని చేసే పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేస్తూ బీజేపీ జెండా ఒక చేత్తో, మరో చేత్తో కూటమి జెండా పట్టుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపిచ్చారు. లంకా దినకర్, దయాకర్ రెడ్డి, మధుకర్,సురేష్ రెడ్డి, సగ్గం శ్రీనివాస్, దారా సాంబయ్య,  కళ్యాణ్ చక్రవర్తి, ఏలూరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
కాగా, లిక్కర్ స్కామ్ లో ఎన్ని పెద్ద తలలు వున్నా వదిలే ప్రసక్తి లేదని మాధవ్ హెచ్చరించారు. ఛాయ్ పై చర్చ కార్యక్రమం సందర్బంగా ఒంగోలులోని ట్రంకు రోడ్డు లోని విందు భోజనం హోటల్ ప్రాంగణంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన  పాల్గొంటూ  కరోనా  పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాల్సిన సమయం ఇదని ఆయన రైతులకు సూచించారు.
 
రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో మెరుగైన పరిపాలన జరుగుతోందని మాధవ్ తెలిపారు. ప్రజల సంక్షేమం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు. కేంద్రం సహకారంతో ఏడాది రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. వీటి ద్వారా సంపద సృష్టి జరుగుతుందని హామీ ఇచ్చారు. అరువు తెచ్చుకున్న జనాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.