దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును చేధించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరంతోపాటు పలు మానవ ఎముకలు లభ్యమయ్యాయని కర్ణాటక హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర తొలిసారి అధికారికంగా ధృవీకరించారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేవంలో వెల్లడిస్తూ ఒక వ్యక్తి తాను 13 ప్రదేశాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదు చేశాడని తెలిపారు. అతని వాంగ్మూలం ఆధారంగా సిట్ బృందాలు ఆయా ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టగా ఆరో ప్రదేశంలో ఒక పురుషుడి అస్థిపంజరం దొరికిందని వెల్లడించారు. మరో కొత్త ప్రదేశంలోనూ కొన్ని ఎముకలు లభ్యమయ్యాయని చెప్పారు.
లభ్యమైన అన్ని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపాం’ అని చెప్పారు. 13వ స్థానంలో మాత్రం ఇంకా ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. మెజిస్ట్రేట్ ముందు ఫిర్యాదుదారు సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇస్తూ తాను వందల సంఖ్యలో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి సిట్ ఏర్పాటు చేసిందని పరమేశ్వర తెలిపారు.
దర్యాప్తులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, శాస్త్రీయంగా, సాంకేతిక పరిజ్ఞానంతో నిజానిజాలు నిగ్గు తేల్చాలని సిట్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ధర్మస్థలంలో సామూహిక ఖననం జరిగిందని ఆరోపిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉంచిందని, ప్రజలను ఏ విధంగానైనా రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకుంటామని పరమేశ్వర హెచ్చరించారు.
కాగా, ఫిర్యాదుదారుడు గుర్తించిన తుది ఖననం చేసిన స్థలం నంబర్ 13 వద్ద ఏదైనా మానవ అవశేషాల కోసం వెతకడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జిపిఆర్) లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై సిట్ నిపుణుల సర్వే నిర్వహించనుంది. విద్యుత్ లైన్లు ఉండటం, ఆ ప్రదేశం ప్రధాన రహదారికి దగ్గరగా ఉండటం వల్ల తవ్వకాల ప్రక్రియను కొనసాగించే ముందు నిపుణుల అభిప్రాయం కోరినట్లు సిట్ వర్గాలు తెలిపాయి.
“బెంగళూరు నుండి జిపిఆర్ ఈరోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురుస్తాయి. జిపిఆర్ ఉపయోగించి మేము స్పాట్ 13పై దృష్టి పెడుతున్నాము” అని సిట్ తో సంబంధం ఉన్న ఒక అధికారి తెలిపారు. తవ్వకాలకు సహాయం చేయడానికి జిపిఆర్ లేదా పర్వత రాడార్ వ్యవస్థలను ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.
అయితే తడి నేల, వర్షం సిగ్నల్ ఖచ్చితత్వాన్ని దెబ్బతీస్తుంది. ఆరోపించిన 13 ఖనన ప్రదేశాలలో, 12 ప్రదేశాలలో తవ్వకం పూర్తయింది. సైట్ నంబర్ 11 కి దగ్గరగా ఉన్న స్పాట్ 14 గా గుర్తించబడిన కొత్త ప్రదేశాన్ని బుధవారం తవ్వారు, కానీ మానవ అవశేషాలు కనుగొనలేదు. సిట్ తవ్విన స్పాట్ నంబర్ 11 కి చాలా దగ్గరగా ఉన్న చెట్టు దగ్గర అనుకోకుండా మానవ అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు.

More Stories
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం
ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఐఎస్ఐ కుట్ర భగ్నం
ఎట్టకేలకు బెంగాల్లో ‘ది బెంగాల్ ఫైల్స్’ 15న విడుదల