తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టంపై ఆయా రాష్ట్రాల నుంచి నివేదికలు రాగానే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లాలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిలు ఈటల రాజేందర్, కొండా విశేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు.
ముందుగా ఖమ్మం నగర శివారులోని ధ్వంసలాపురంలో ము న్నేరు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక ఫం క్షన్ హాల్ లో బిజెపి తరఫున ఏర్పాటు చేసిన ని త్యావసర సరుకుల కిట్లను కేంద్ర మంత్రి వరద బా ధితులకు పంపిణీ చేశారు. ఆ తరువాత తిరుమలాయపాలెం మండలం, రాకాసి తండాను సందర్శించి దెబ్బతిన్న ఇండ్లు, పంటలను పరిశీలించారు.
బాధితులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవడానికి కలిసికట్టుగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విపత్తులు వచ్చిన సమయంలో కేంద్రం నిధులు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉంటాయని, కేంద్రంలో కాంగ్రెస్ హయాంలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించారని, ఆ ఫార్మెట్ ప్రకారమే కేంద్రం నిధులను ఇచ్చి ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఖమ్మం బాధితుల కోసం అదనపు డిజాస్టర్ నిధులు తీసుకువస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మరోసారి తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. పార్టీ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు.
కేంద్రం 75 శాతం నిధులు ఇస్తే,రాష్ట్రం 25 శాతం నిధులను కలిపి జమ చేస్తుందని, ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడానికి కూడా అవకాశం ఉండదన్నారు. అయితే, తెలంగాణలో గత ప్రభుత్వం దీనికి సంబంధించిన రూ.1348 కోట్ల నిధులను నిధులను పక్కదారి మళ్లించి, కనీసం యుసి సరిఫికెట్లను పంపకపోవడం వల్ల కేంద్రం నుంచి రూ. 200 కోట్ల పైచిలుకు నిధులు ఆగిపోయాయయని విమర్శించారు.
ఎపికి అధిక నిధులు ఇచ్చి తెలంగాణకు తక్కువ నిధులు ఇచ్చారని వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి స్పందిస్తూ అసలు ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం నిధులు మంజూరు చేయలేదని, ఆయా రాష్ట్రాల నుంచి ఇంకా నివేదికలే కేంద్రానికి అందలేదని స్పష్టం చేశారు. త్వరలో కేంద్ర అధికారుల బృందం కూడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తుందని చెప్పారు.

More Stories
మహిళల సాధికారతకు మద్దతుగా బీజేపీ స్కూటీ ర్యాలీ
మహిళా బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు
దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్