చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లు ఉన్నా వాటిలో ఇప్పటికే పౌరులు నివాసముంటున్నట్లయితే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పష్టతనిచ్చారు.
నివాసేతర భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌరులు నివాసముంటున్న ఆక్రమణల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తమకు సంబంధించినంత వరకు మున్ముందు ఆక్రమణలు రాకుండా చూడడం తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు.

More Stories
హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ
బాల్క సుమన్‌పై దేశద్రోహం కేసు
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్