భారత్‌తో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్త పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడుతూ, సవరించిన దేశ భౌగోళిక రాజకీయ మ్యాప్‌ను ఆ కొత్త పుస్తకాల్లో చేర్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన మూడు భారతదేశ ప్రాంతాలను నేపాల్ భూభాగంలో కలిపివేసినట్లుగా అందులో చూపించింది.
భారతదేశానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాదురా ఈ మూడు ప్రాంతాలను నేపాల్‌కు చెందినవిగా చూపిస్తున్న కొత్త రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల భారత్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కృత్రిమ ఆక్రమణలను తాము సహించబోమని ఖండించింది.
నేపాల్ విద్యా శాఖకు చెందిన కరిక్యులమ్ డెవలప్మెంట్ సెంటర్ ఇటీవలనే సవరించిన మ్యాప్‌తో కూడిన పుస్తకాలను ప్రచురించిందని సమాచార శాఖ అధికారి గణేష్ భట్టారారు తెలిపారు. 9, 12 తరగతుల సిలబస్‌లో వీటిని చేర్చారు.

More Stories
హెన్రీ బీ కగన్, కెన్సో సోయిలకు కెమిస్ట్రీలో నోబెల్
2036 వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యంకు భారత్ తో సహా 7 దేశాలు పోటీ
ఫ్లైదుబాయ్ హీరో స్మిత్ మచ్చర్ పుర్రెకు పగుళ్లు.. అత్యవసరంగా ఆపరేషన్