మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలిజాబితాలో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది.
రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆత్మకూరు నుంచి ఆనం రాంనారాయణ రెడ్డి, దెందలూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ పోటీ చేయాల్సిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తోంది. మరో 16 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. రెండో జాబితాలో పీహెచ్‌డీ చేసిన వారు ఒక్కరు, పీజీ చేసిన వారు 11మంది, గ్రాడ్యుయేట్లు తొమ్మిది మంది, ఇంటర్మీడియట్ చదివిన వారు ఎనిమిది మంది, 10వ తరగతి చదివిన వాళ్లు ఐదుగురు ఉన్నారు.
ఇలా ఉండగా, జనసేన అధినేత పవన్ కల్యాన్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. లోక్ సభకు పోటీ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. గతంలో భీమవరం, గాజువాకలో పోటీ చేసిన తాను ఈసారి పీఠాపురం బరిలో దిగుతున్నట్లు చెప్పారు.. అభ్యర్థుల జాబితా ఇదే!
More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష