
పోడు పట్టాల పేరిట గత పాలకులు కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేశారని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, నరేంద్ర మోదీ నాయకత్వ కాలంలో భారతదేశం నెంబర్ 1 గా నిలుస్తుందని ఉట్నూర్ పట్టణ కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిర్వహించిన బిజెపి విజయసంకల్ప యాత్రలో చెప్పారు.
తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలను విస్మరించారని ఆ హామీలను ప్రజలు కూడా మర్చిపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఇచ్చిన హామీల నిలబెట్టుకోవడంలో విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు.
కేంద్రంలో రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజనేతరులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు రైతుబంధు రావాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజ నేతలు సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం చెల్లింపుల్లో ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత