గంజాయి కేసులో యూట్యూబర్‌ షణ్ముఖ్ జస్వంత్‌ సోదరులు

బిగ్‌ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ ఇంట్లో గంజాయి, డ్రగ్స్ దొరికాయనే వార్త తీవ్ర కలకం రేపింది. అతడి అన్న సంపత్ వినయ్ కోసం హైదరాబాద్ నార్సింగి పోలీసులు షణ్ముక్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి, డగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 
 
వైజాగ్‌కు చెందిన ఓ యువతిని షార్ట్‌ ఫిలిం ఛాన్స్‌లు ఇప్పిస్తానని షణ్ముక్‌ మోసం చేస్, ప్రేమ పేరుతో అతని సోదరుడు సంపత్‌ వాడుకున్నాడు. పదేండ్ల పాటు వాడుకున్న తర్వాత ఇప్పుడు సంపత్‌ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవ్వడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లగా, అనుకోని విధంగా షణ్ముక్‌ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. 
 
ఈ క్రమంలో కేసుకు సంబంధించి బాధితురాలు పలు కీలక విషయాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది.’యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముక్ మోసం చేశాడు. షణ్ముక్ ద్వారానే అతని సోదరుడు సంపత్ పరిచయమయ్యాడు. సంపత్ వినయ్ ప్రేమ పేరుతో దగ్గరై పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు’ అని ఆమె తెలిపింది.
 
`హోటల్స్, విల్లాలకు తీసుకువెళ్లి బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సంపత్‌ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టగా చేతికి రింగ్ పెట్టి పెళ్లి అని నమ్మించాడు. పెళ్లి చేసుకున్నామని చెప్పి పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు’ అని వెల్లడించింది. 
 
`అబార్షన్ చేయించిన విషయాన్ని సంపత్ తల్లితండ్రులకు చెబితే బయటకు చెప్పవద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే  ఫిజికల్‌గా కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతితో పెళ్లి అయ్యిందని తెలిసి షాక్ గురయ్యాను’ అంటూ ఆమె ఫిర్యాదు చేసింది.
 
`షణ్ముక్ వద్ద గంజాయి డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయి. షణ్ముక్, సంపత్ వద్ద మత్తు పదార్థాలను పోలీసులు కూడా చూశారు. జావేద్ అనే కానిస్టేబుల్ షణ్ముక్‌కి సహకరించే ప్రయత్నం చేశాడు. డ్రగ్స్ చూడగానే మమ్మల్ని వెంటనే కిందకు వెళ్లమని బలవంత పెట్టాడు. నన్ను రాజీ పాడమని కానిస్టేబుల్ జావేద్ ఒత్తిడి తెచ్చాడు’ అంటూ ఆమె ఆరోపించింది. 
 
డ్రగ్స్‌కి సంబంధించిన వీడియో ఆధారం తన దగ్గర ఉందని చెబుతూ తన ప్రాణానికి ముప్పు ఉందని బాధితారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో అవకాశాల పేరుతో షణ్ముక్, పెళ్లి పేరుతో సంపత్ ఇలా అన్నదమ్ములిద్దరూ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గంజాయి, డ్రగ్స్ వినియోగంపై షణ్ముక్‌ సోదరులిద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.