దీనిపై కేంద్రం స్పందిస్తూ ఎలాంటి ఎలాంటి పత్రాలు లేకుండా రహస్యంగా దేశంలోకి వలసదారులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని పేర్కొంది. అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని నిర్బంధించడం, తిరిగి వారి దేశాలకు పంపించడం సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. అలాంటి పరిస్థితిలో దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న అక్రమ వలసదారుల గురించి డేటాను సేకరించడం సాధ్యం కాదని తెలిపింది.
2017 నుంచి 2022 మధ్య కాలంలో 14,346 మంది విదేశీయులను తిరిగి వారి దేశాలకు పంపినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం, అసోంలో వంద ఫారినర్స్ ట్రిబ్యునల్స్ పని చేస్తున్నాయని, 31 అక్టోబర్ 2023 వరకు 3.34 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని తెలిపింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆదేశాలకు సంబంధించిన 8,461 కేసులు గౌహతి హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది.
ఈ సందర్భంగా అసోంలో చొరబాట్లను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు ఫెన్సింగ్ వేస్తున్నట్లు వివరించింది.

More Stories
హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల ఆకస్మిక రద్దుపై భారత్ ఆందోళన
మద్యం, పొగాకుతోనే 62 శాతం నోటి కాన్సర్ కేసులు
ఎయిర్ ప్యూరిఫైయర్స్పై జీఎస్టీ తగ్గింపుకు విముఖత