
సంబంధం లేని విషయాల గురించి మాట్లాడవద్దని సంజయ్‌సింగ్‌కు న్యాయమూర్తి హెచ్చరించారు. గౌతమ్ అదానీపై తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు సంస్థలు పనిచేయడం లేదని సంజయ్ సింగ్ కూడా ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో తనను కూడా సంబంధం లేని ప్రశ్నలు అడిగారని సంజయ్‌సింగ్ న్యాయస్థానానికి తెలిపారు.
‘నా తల్లి నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నాను? నాభార్యకు ఎందుకు రూ.10,000 ఎందుకు పంపాను?వంటి అనవసరమైన ప్రశ్నలతో ఈడీ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్గా మారింది. అన్నీ అబద్ధాలే. అదానీపై ఫిర్యాదు చేశాను. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మరో రెండు వారాల రిమాండ్ పెంచాలని ఈడీ అభ్యర్థన మేరకు, న్యాయస్థానం అక్టోబర్ 27 వరకు సంజయ్‌సింగ్ రిమాండ్‌ను పొడిగించింది.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!