రూపే కార్డులు, బీమ్యూపిఐలతో సాగిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులకు సూచించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలు చేసిన ఛార్జీలను వెంటనే చెల్లించాలని ఆదేశించింది.
ఈమేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఆ మేరకు సర్కులర్ విడుదల చేసింది. ఐటి చట్టం లోని సెక్షన్ 269 ఎస్యును అనుసరించి ఈ డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయరాదని స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీల పెంపు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ఫైనాన్స్ యాక్ట్ 2019 లో కేంద్రం ఈ సెక్షన్ను చేర్చింది.
రూపే, డెబిట్ కార్డు బీమ్ యూపిఐ, యూపిఐ క్యూ ఆర్ కోడ్లను నిర్దేశిత ఎలెక్ట్రానిక్ వ్యవస్థల కింద నోటిఫై చేసింది. అందువల్ల ఈ రూపంలో చెల్లించిన వారికి వెంటనే వసూలు చేసిన ఆయా ఛార్జీలను చెల్లించాలని సిబిడిటి సూచించింది. అలాగే వీటికి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) వర్తించదని పేర్కొంది.

More Stories
టాటా సన్స్ ఛైర్మన్గా మరోసారి చంద్రశేఖరన్.. చెల్లదన్న నోయెల్ టాటా
ఇకపై మెడికల్ స్టోర్లలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి
అమెరికా క్రైస్తవ బృందం సీబీఐ ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘనలపై కేసు