“ప్రపంచంలో విశ్వాసం అనే అంశంలో లోటు కనిపిస్తుంది. ఈ లోటును తొలగించి, నమ్మకాన్ని పెంచాలి. ప్రపంచం మంచి కోసం మనం అందరం కలిసి నడవాలి. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన లోటును మనం భర్తీ నమ్మకంతో భర్తీ చేయాలి” అంటూ ప్రధాని పిలుపిచ్చారు.
“‘సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ మంత్రంతో అందరం ముందుకు వెళ్లాలి. తూర్పు-పడమర, ఉత్తరం-దక్షిణం మధ్య ఉన్న విభేదాలైనా, ఆహారం, ఇంధనం, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఎనర్జీ.. ఇలా ఏదైనా భావి తరాల కోసం మనం మన సమస్యలను పరిష్కరించుకోవాలి,” అని మోదీ సూచించారు.
ఇక తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ప్రధాని జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్‌కు స్వాగతం పలికారు. ఇది ఆఫ్రికెన్ యూనియన్‌కు ఓ చారత్రిక ఘట్టం! సభ్యులందరి అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ అధినేత అజాలీ అసౌమనీని శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.
అంతకుముందు మొరాకోలో సంభవించిన భూకంపంలో మృతులకు సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. వారి అత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ప్రకృతి విపత్తు సృష్టించిన అలజడి నుంచి మొరాకో దేశం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని తెలిపారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు, దౌత్యవేత్తలు దిల్లీకి వచ్చారు. వీరిలో కొందరు శుక్రవారం రాత్రికి, శనివారం ఉదయానికి చేరుకున్నారు.
‘మొరాకోలో భూకంపం అనేక మందిని బలిగొనడం విచారకరం. ఈ విషాద సమయంలో మొరాకో ప్రజల క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు సాధ్యమైన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.

More Stories
రాజకీయాలు వినోదం కాదు, సినిమా లాంటి ప్రదర్శన కూడా కాదు
ట్రంప్ ఇరాన్ యుద్ధంలో ఓడిపోతున్నారా?
అక్రమ వలసదారుల కోసం బెంగాల్ లో నిర్బంధ కేంద్రాలు